Man donates body for covid research : దేశంలోనే తొలిసారిగా కరోనా పాజిటివ్ వచ్చిన ఓ రోగి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. తన శరీరం సమాజం కోసం ఉపయోగపడితే చాలని భావించి మరణానికి ముందే కరోనాపై పరిశోధన కోసం తన దేహాన్ని దానం చేశాడు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఈ ఘటన జరిగింది.
కోల్ కతా నగరంలోని న్యూటౌన్ ఏరియాలో నివసించే నిర్మల్ దాస్(89)కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న నిర్మల్ దాస్ ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో తన శరీరం ఇతరుల మేలు కోసం ఉపయోగపడాలని భావించాడు. మరణానికి ముందే కరోనాపై వైద్య పరిశోధనల కోసం తన దేహాన్ని దానం చేశాడు. RG కార్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు శనివారం నిర్మల దాస్ తన శరీరాన్ని అప్పగించనున్నాడని ఓ అధికారి తెలిపారు.
ALSO READ Woman Arrested : 15 ఏళ్ల క్రితం సరిహద్దు దాటి..హిందువుగా వేషం మార్చిన ముస్లిం యువతి
మరోవైపు,పశ్చిమ బెంగాల్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 3805 పాజిటివ్,34 మరణాలు నమోదయ్యాయి. కోల్ కతాలోనే అత్యధికంగా 481 కొత్త కేసులు నమోదవగా,ఆ తర్వాత ఉత్తర 24 పరగణాల జిల్లాలో 438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 19,86,667కి..మరణాల సంఖ్య 20,515 కు చేరుకుందని బెంగాల్ ఆరోగ్య శాఖ తెలిపింది.