COVID PEOPLE RUSH TO CANCEL WEDDINGS DEMAND REFUNDS WEDDING INDUSTRY TAKES ANOTHER HIT GH VB
Marriages: కోవిడ్ కారణంగా మీ పెళ్లి రద్దు అయిందా..? ఆ డిమాండ్లతో అతలాకుతలం అవుతున్న వెడ్డింగ్ ఇండస్ట్రీ..
ప్రతీకాత్మక చిత్రం
ఏనాడు ఆగని పెళ్లిళ్లు గతేడాది కరోనా కారణంగా స్తంభించిపోయాయి. దాంతో పెళ్లిళ్లు ప్లాన్ చేసుకున్న వారంతా నష్టాలను చవి చూశారు. వెడ్డింగ్ ఇండస్ట్రీపై కూడా ప్రభావం పడింది.
ఇప్పటివరకు ఎదురైన ఎంతటి దుర్భేద్య పరిస్థితులలోనైనా పెళ్లిళ్లు(Marriages) అనేవి జరగడం మాత్రం ఆగలేదు. కానీ ఎప్పుడైతే కరోనా(Corona) మహమ్మారి విజృంభించిందో.. అప్పట్నుంచి వెడ్డింగ్(Wedding) ఇండస్ట్రీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఏనాడు ఆగని పెళ్లిళ్లు గతేడాది కరోనా కారణంగా స్తంభించిపోయాయి. దాంతో పెళ్లిళ్లు ప్లాన్(plans) చేసుకున్న వారంతా నష్టాలను చవి చూశారు. వెడ్డింగ్ ఇండస్ట్రీపై(Wedding Industry) కూడా ప్రభావం పడింది. మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ (omicron) రూపంలో పెళ్లిళ్లకు కరోనా అడ్డంకిగా పరిణమిస్తోంది. దాంతో ప్రస్తుతం వరుసబెట్టి పెళ్లిళ్లు రద్దు అవుతున్నాయి. పెళ్లి మండపాల బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. అన్నిటికి ముందస్తుగానే కట్టిన డబ్బును రిఫండ్ చేయాలని ప్రజలు చేసే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ వెడ్డింగ్ ఇండస్ట్రీ (wedding industry) అతలాకుతలమవుతోంది.
కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భారత రాజధాని ఢిల్లీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కేవలం 20 మంది అతిథులను మాత్రమే వివాహ వేదిక వద్ద అనుమతించింది. అంతే, ఒక్కసారిగా వెడ్డింగ్ ఇండస్ట్రీ నిరాశాజనకమైన భవిష్యత్తులోకి జారుకుంది. పెళ్లిళ్ల తేదీలను ఫిక్స్ చేసుకున్న చాలామంది ప్రజలు అడ్వాన్స్డ్ బుకింగ్స్ క్యాన్సిల్ శరవేగంగా చేసేస్తున్నారు.
వీరు వెడ్డింగ్ కోసం చేసిన హోటల్, వెన్యూ, బ్యాండ్, ఫుడ్ క్యాటరింగ్ వంటి బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. దాంతో వివాహ పరిశ్రమ దిక్కు తోచని స్థితిలో నేల చూపులు చూస్తోంది. వెడ్డింగ్ బ్యాండ్ కంపెనీలు ఉన్నపళంగా కస్టమర్లకు డబ్బులను రిఫండ్ చేయలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
హర్యానా, ముంబయి తదితర రాష్ట్రాలు మ్యారేజ్ ఫంక్షన్లకు 200 మంది అతిథులను అనుమతించాయని.. కానీ ఢిల్లీ మాత్రమే ఇలాంటి ఆంక్షలను విధించడం సరైందికాదని పలువురు వెడ్డింగ్ బ్యాండ్ (Wedding Bands) ఓనర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పనులే జీవనాధారంగా బతుకుతున్న వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని యజమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా పెళ్లిళ్లు జనవరి 20 నుంచి ప్లాన్ చేశారని.. కానీ ఇప్పుడు అవన్నీ రద్దు అయిపోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లిళ్ల కోసం ఇప్పటికే అన్ని ప్రిపరేషన్స్ పూర్తి చేసుకున్న వెండార్స్ ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.
అన్నింటికి అడ్వాన్స్‌లు ఇచ్చుకున్న ప్రజలు అనుకోని అతిథిగా వచ్చిన ఒమిక్రాన్ వల్ల పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ మినిట్ లో రద్దు చేస్తే రిఫండ్ చేయడం కుదరదంటూ కొన్ని వెడ్డింగ్ కంపెనీలు నిర్మొహమాటంగా చెప్తున్నాయి. దీంతో ప్రజలు కూడా ఎంతో కొంత నష్టం(Loss) పోవాల్సిన పరిస్థితి. దేవాలయాల్లో పెళ్లి చేసుకోవాలన్నా సందర్శకులను అనుమతించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెళ్లి క్యాన్సిల్ చేయడం అనేది అనివార్యంగా మారుతోంది.
అయితే వెడ్డింగ్ ఇండస్ట్రీ కరోనా నిబంధనలను సక్రమంగా పాటిస్తుందని.. అందువల్ల పెళ్లిళ్లపై కఠిన ఆంక్షలు విధించడం మానేయాలని కొందరు హోటల్ యజమానులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కఠినమైన ఆంక్షలను అమలు చేయడం కంటే పెళ్లి(Marriage) అతిథులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడం మంచిది. వ్యాక్సినేషన్ తీసుకున్న అతిథులను మాత్రమే పెళ్లి వేడుకలకు అనుమతించడం, మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టడం వంటి ఆంక్షలు మాత్రమే విధిస్తే కాస్త ఊరటగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.