Viral Video: షాకింగ్ వీడియో.. జోరువానలో దారుణం.. కరోనా రోగి మృతదేహాన్ని నదిలో విసిరేస్తూ..

కరోనా రోగి మృతదేహాన్ని నదిలో విసిరేస్తున్న దృశ్యాలు

రప్తి నది బ్రిడ్జి వద్దకు ఇద్దరు వ్యక్తులు ఓ కరోనా రోగి మృతదేహంతో వచ్చారు. ఒకరు పీపీఈ కిట్ వేసుకోగా.. మరొకరు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. వారిద్దరు కలిసి కరోనా రోగి మృతదేహాన్ని నదిలో విసిరేశారు.

  • Share this:
    కరోనా కాలంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. కరోనా రోగి మృతదేహాన్ని తాకితే తమకూ వైరస్ వస్తుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. అంత్యక్రియలకు బంధువులు రావడం లేదు. చివరకు వారిని పూడ్చిపెట్టేందుకు కూడా ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో యూపీలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని నదిలో విసిరేశారు. బలరాంపూర్‌లో మే 28న ఈ ఘటన చోటుచేసుకుంది. బలరాంపూర్‌లో రప్తి నది బ్రిడ్జి వద్దకు ఇద్దరు వ్యక్తులు ఓ కరోనా రోగి మృతదేహంతో వచ్చారు. ఒకరు పీపీఈ కిట్ వేసుకోగా.. మరొకరు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. వారిద్దరు కలిసి కరోనా రోగి మృతదేహాన్ని నదిలో విసిరేశారు.

    ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. జోరు వానలో కోవిడ్ పేషెంట్ బాడీని నదిలో విసిరేస్తున్న దృశ్యాలు వైరల్ మారాయి.

    ఈ వైరల్ వీడియోపై బలరాంపూర్ వైద్య అధికారులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కరోనాతో మే 25న ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించి మే 28న మరణించారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే వారి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఐతే ఆ డెడ్ బాడీని శ్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననం చేయకుండా నదిలో విసిరేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. మృతుడి బంధువులపై కఠిన చర్యలు తీసుకుంటామని బలరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వీబీ సింగ్ తెలిపారు.

    ఇటీవల బీహార్, యూపీలో గంగా నదిలో మృతదేహాలు తేలిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వందల సంఖ్యంలో మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చాయి. అవన్నీ కరోనా రోగుల మృతదేహాలేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఎగువన ఉన్న యూపీ నుంచే మృతదేహాలు కొట్టుకుస్తున్నాయని బీహార్ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాదు గంగా నది ఒడ్డున కూడా ఎంతో మంది కరోనా రోగుల మృతదేహాలను పూడ్చిపెట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు యూపీలోని పలు ప్రాంతాల్లో గంగా నది ఒడ్డున మృతదేహాలు బయటకు తేలాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నదుల్లో మృతదేహాలను విసిరేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతలోనే మరో ఘటన జరగడం.. వీడియో కూడా బయటకు రావడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published: