Home /News /national /

COVID PATIENT GOT MARRIAGE AT COVID WARD IN KERALA HOSPITAL VS

covid marriage : కోవిడ్ వార్డులోనే లవ్ మ్యారేజ్... పీపీఈ కిట్లతోనే వేదమంత్రాలు...!

alppuzha medical collage

alppuzha medical collage

covid marriage పెళ్లికొడుకుకు కరోనా పాజిటివ్ ఉన్నా పెళ్లి ఆపలేదు..లవ్ మ్యారెజ్ కావడంతో పెళ్లికూతురు, పెట్టిన ముహుర్తానికే పెళ్లి కావాలని పట్టుబట్టింది. దీంతో చేసేదేమి లేక ..ఆసుపత్రి అధికారుల అనుమతితో ప్రేమ జంట కొవిడ్ వార్డులోనే ఒక్కటయ్యారు.

ఇంకా చదవండి ...
కళ్యాణం వచ్చినా..కక్కోచ్చిన ఆగదు అంటారు పెద్దలు..అందుకే ఎంత వద్దన్నా..పెళ్లిళ్లు అయ్యో సమయానికి అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ రాకున్నా..ఆపడానికి ప్రయత్నం చేసినా... పెళ్లిల్లు మాత్రం ఆగవు. అందుకే దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనాతో సతమవుతున్నా కొన్ని పెళ్లిల్లు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయి..అందుకేనేమో మాంగళ్యబలం సమయాన్ని, విలువను సాంప్రదాయికంగా ఇంకా బలంగా నమ్ముతున్నారు.

ప్రస్తుత రోజుల్లో కరోనాతో చాలమంది బయటకు రాని పరిస్థితి. ఎప్పుడు కరోనా తమను అటాక్ చేస్తుందో అనే ప్రాణభయంతో ప్రజలు బతుకుతున్నారు. తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇలా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది కరోనా..కాని ఇవే పరిస్థితులు ఓ పెళ్లి జంటను కలిపాయి. పెళ్లి కుమారుడితో పాటు తల్లికి కూడ కరోనా రావడంతో అమ్మాయి తరుఫువారితో పాటు అధికారులను ఒప్పించి ఆసుపత్రిలోనే పెళ్లి జరిపించారు.

కేరళలో ఇదే జరిగింది.ముహుర్తాలు ఫిక్స్ చేసుకున్నాక కరోనా వస్తే సాధరణంగా వాయిదా వేస్తారు. అయితే పెళ్లి కొడుకుతో పాటు ఆయన తల్లికి వచ్చి ఓకే ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామి ఇరువురు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటంభాలను ఒప్పించి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. అన్ని బాగుంటే నేడు వారి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగేది.

కాని దురదృష్టవశాత్తు పెళ్లికుమారుడికి వారం రోజుల క్రితం కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో ఆయన అలప్పజ మెడికల్ కాలేజీలో చికిత్స పోందుతున్నాడు. పెళ్లి కోడుకుతో పాటు తల్లికి కూడ కరోనా సోకడంతో ఇద్దరు ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ముహుర్తం దగ్గరపడుతున్నా కొవిడ్ తగ్గకపోవడంతో ఓ నిర్ణయానికి వచ్చారు. పెళ్లికొడుకు తోపాటు కావాల్సిన తల్లి కూడ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది కాబట్టి పెట్టిన ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు పెళ్లికూతురు సైతం పెళ్లికి పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక వైద్య అధికారులను , ఆసుపత్రి సిబ్బందిని ఒప్పించారు.

ఇంకేముంది కరోనా వార్డు వారికి పంక్షన్ హాలు ఆయింది. కరోనా రోగులే వారికి బంధువులు అయ్యారు. పీపీఈ కిట్లు పెళ్లి బట్టలయ్యాయి. పెట్టిన ముహుర్తానికి ప్రేమ జంట ఒక్కటయ్యారు. దీంతో జిల్లాలో ఈ పెళ్లి చర్చనీయాంశం అయింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Kerala, Love marriage

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు