చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కోవిడ్ రోగి నుంచి వీర్యం సేకరణ.. ఆ వెంటనే అతడు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ఓ వైపు భర్తను కోల్పోతున్న బాధ, మరోవైపు అతడి ప్రతిరూపాన్నైనా చూసుకోవాలనే ఆశ ఆమెను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఈ నేపథ్యంలో జూలై 20న ఆమె గుజరాత్​లో ఎమర్జెన్సీ పిటిషన్​ దాఖలు చేసింది

  • Share this:
కోవిడ్ బాధితుడి వీర్యాన్ని భద్రపరిచేందుకు అనుమతివ్వాలని అతడి భార్య గుజరాత్ హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు అనుమతితో బాధితుడి నుంచి వైద్య సిబ్బంది వీర్యాన్ని సేకరించారు. అయితే ఆ వెంటనే, కొన్ని గంటల్లోనే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనాతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి భార్య ఇటీవల గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. చావుబతుకుల్లో ఉన్న తన భర్త వీర్యం ఇప్పించాలని, అతడి ద్వారా ఐవీఎఫ్‌ పద్ధతిలో ఒక బిడ్డకు తల్లి అయ్యే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ విషయంలో తన అత్త, మామలు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన గుజరాత్​ హైకోర్టు ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా సదరు ఆస్పత్రి వర్గాలను ఆదేశించింది. కోర్డు ఆదేశాల ప్రకారం, చావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తి వీర్యాన్ని సేకరించారు డాక్టర్లు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అతడు తుది శ్వాస విడిచాడు.

గుజరాత్​ వడోదరకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి గత మూడు నెలల క్రితం కరోనా బారినపడి స్టెర్లింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి 29 ఏళ్ల భార్య ఉంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు లేరు. జూలై 20న అతడి పరిస్థితి విషమించింది. అతడు 24 గంటలకు మించి బతికే అవకాశం లేదని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు.

దీంతో ఓ వైపు భర్తను కోల్పోతున్న బాధ, మరోవైపు అతడి ప్రతిరూపాన్నైనా చూసుకోవాలనే ఆశ ఆమెను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఈ నేపథ్యంలో జూలై 20న ఆమె గుజరాత్​లో ఎమర్జెన్సీ పిటిషన్​ దాఖలు చేసింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఎఆర్​టి) ద్వారా తన భర్త వీర్యాన్ని (స్పెర్మ్​) సేకరించి, భద్రపరిచేలా ఆసుపత్రి వర్గాలకు ఆదేశాలివ్వాలని పిటిషన్​లో కోరింది.

సానుకూలంగా స్పందించిన కోర్టు
ఆమె పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన కోర్టు అందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఆ పేషెంట్​ నుంచి వైద్య నిపుణులు వీర్యాన్ని సేకరించి, భద్రపరచాలని సదరు ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. కాగా, కోర్డు ఆదేశాల మేరకు స్టెర్లింగ్ ఆసుపత్రి డాక్టర్లు రోగి వీర్యాన్ని.. టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ పద్ధతి ద్వారా సేకరించి ఐవిఎఫ్ ల్యాబ్‌లో భద్రపర్చింది. ఈ ప్రక్రియ ముగిసిన కొద్ది గంటల్లోనే గురువారం బాధితుడు కన్నుమూశారు. స్టెర్లింగ్ హాస్పిటల్‌లోని కోవిడ్ -19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ మయూర్ దోధియా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
Published by:Shiva Kumar Addula
First published: