• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID INSPIRATION KASHMIR BOATMAN IS HELPING COVID 19 PATIENTS WITH FLOATING AMBULANCE SERVICE ON DAL LAKE OF SRINAGAR NK

Inspiration: పడవే అంబులెన్స్... దాల్ సరస్సులో సేవలు... యువకుడిపై ప్రశంసలు.. వీడియో

Inspiration: పడవే అంబులెన్స్... దాల్ సరస్సులో సేవలు... యువకుడిపై ప్రశంసలు.. వీడియో

పడవే అంబులెన్స్... దాల్ సరస్సులో సేవలు (image credit - ANI)

Covid Inspiration: ఆటోలు ఇతర బండ్లను అంబులెన్సులుగా మార్చడం చూస్తున్నాం... కాశ్మీర్‌లో ఓ యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి ప్రపంచ ప్రశంసలు అందుకుంటున్నాడు. వీడియో చూద్దాం.

  • Share this:
    Covid Inspiration: ఈ కరోనా కాలంలో ఎవరైనా మంచి పనులు చేస్తే... అవి మనం తెలుసుకోవడం మనకే మంచిది. వాటి ద్వారా మనలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం కరోనాను జయించగలం అనే సంకల్పం ఏర్పడుతుంది. దేశంలో రోజూ 4 లక్షల దాకా కరోనా కేసులు వస్తుంటే... చాలా మంది ఇతరులకు సాయం చేస్తూ... ఆపదలో ఆదుకుంటున్నారు. అలాంటి ఓ యువకుడు... కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంటున్నాడు. ఈమధ్యే కరోనా బారిన పడి... విజయవంతంగా కోలుకున్నాడు. అప్పుడు అతనికి కరోనా అంటే ఏంటో... దాని వల్ల ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా తెలిశాయి. అంతే... తన పడవను అంబులెన్సుగా మార్చేసి... సర్వీస్ అందిస్తున్నాడు. దాల్ సరస్సులో... కరోనా పేషెంట్లను తన పడవలో తీసుకెళ్తున్నాడు. అతనే తారిక్ అహ్మద్ పట్లూ.

    పట్లూకి గతేడాది ఆగస్టులో కరోనా సోకింది. అప్పటి నుంచి తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనుకున్నాడు. అందుకు తాను ఏం చెయ్యగలను అని ఆలోచించాడు. తన పడవనే అంబులెన్సుగా మార్చేస్తే ఎలా ఉంటుంద అని ఆలోచించాడు. అందుకు కొంత డబ్బు కావాలి. పోగేశాడు. ఏప్రిల్‌లో ఇది సాధ్యమైంది. వాటర్ అంబులెన్స్ రెడీ అయ్యింది.


    ఈ పడవలో పీపీఈ కిట్స్ ఉన్నాయి. స్ట్రెచర్స్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఉంది. తద్వారా కరోనా పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికవుతోంది. పట్లూకి కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ బోట్ ఎక్కనివ్వలేదు. ఎవరి భయం వారిది. అప్పట్లో పట్లూ... 20 రోజులు ఇంట్లో క్వారంటైన్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది... ప్రతిసారీ అదే సమస్య ఎదురైంది. తనలాంటి బోట్ నడిపేవారే తనను ఎక్కించుకోవడానికి భయపడటం చూసి... ఆశ్చర్యపోయిన పట్లూ... తనలాగా ఇంకెవరికీ అవ్వకూడదనే ఈ అంబులెన్స్ సర్వీసులు తెచ్చాడు.


    ఇది కూడా చదవండి: మీ గోర్లపై అర్థ చంద్రాకారం ఉందా... అయితే మీరే అదృష్టవంతులు... ఎందుకో తెలుసుకోండి

    శ్రీనగర్‌కి టూరిస్టులు పెద్ద సంఖ్యలో రావడంతో... అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న తులిప్ గార్డెన్ ఓపెన్ చేశాక మరింతగా పెరిగారు. దాంతో... కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఓ రోజు 131 నమోదయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లో కూడా ఇప్పుడు కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. మొన్న 3614 కొత్త కేసులు రాగా... 56 మంది చనిపోయారు.
    Published by:Krishna Kumar N
    First published: