Covid Double Attack: ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు... ఇండియాలో ఇదే తొలిసారి

ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు (image credit - NIAID)

Covid Double Attack: ఒక కరోనా వేరియంట్ తోనే తట్టుకోవడం కష్టం అనుకుంటే... ఏకంగా రెండు వేరియంట్లు ఒకే వ్యక్తిపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరం. ఇండియాలోనే ఈ ఘటన జరిగింది.

  • Share this:
    Covid Double Attack: ఇండియాలో కరోనా వేరియంట్లు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నాయో తెలుసుకునేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. అసోంలో ఓ మహిళా డాక్టర్‌కి ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు సోకాయి. ఆమెలో డెల్టా (Delta), ఆల్ఫా (Alpha) వేరియంట్లు ఉన్నట్లు డాక్టర్లు తెలుసుకున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే... ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ (Covid vaccine) రెండు డోసులూ వేసుకున్నారు. అయినా సరే సరే రెండు వేరియంట్లు సోకాయంటే.. దానర్థం... వ్యాక్సిన్ వేసుకున్నవారు కూడా కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

    ఇండియాలో ఇదే తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ దేశంలో ఎవరికీ ఇలా రెండు కరోనా వేరియంట్లు సోకలేదు. పైగా... ఆ డాక్టర్‌కు రెండు వేరియంట్లూ ఒకేసారి సోకాయి. "ఆమె శాంపిల్స్‌ని ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. డెల్టా, ఆల్ఫా వేరియంట్లు ఉన్నాయి. ఎందుకైనా మంచిదని... మరోసారి శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశాం. అప్పుడు కూడా అదే ఫలితం వచ్చింది. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు కన్ఫామ్ చేసుకున్నాం. ఇంతకుముందు ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకింది" ICMR నోడల్ అధికారి విశ్వజ్యోతి బొర్కాకొటి తెలిపారు.

    నిజానికి ఆమె వ్యాక్సిన్ వేయించుకోకపోయి ఉంటే... రెండు వేరియంట్ల కారణంగా... ఆమె పరిస్థితి దారుణంగా ఉండేది. 2 డోసులూ వేసుకోవడం వల్ల ఆమెకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా లేదు. అంటే దానర్థం... వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కరోనా సోకినా... అది అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అనుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: Video: పెళ్లిలో దెయ్యంలా కనిపించిన వధువు... పారిపోయిన వరుడు

    అక్కడ కూడా డబుల్ ఎటాక్:
    ఆ మధ్య బెల్జియంకు చెందిన 90 ఏళ్ల ముసలామెపై కూడా డబుల్ వేరియంట్లు దాడి చేశాయి. ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు బాడీలోకి ప్రవేశించాయి. వయసు ఎక్కువ కావడం వల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. తట్టుకోలేక చనిపోయింది. ఆమె వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా వేసుకోలేదు. అంటే దానర్థం... వ్యాక్సిన్ వేయించుకోని వారికి డబుల్ వేరియంట్లు సోకితే... వారు చనిపోయే ప్రమాదం కూడా ఉందని అనుకోవచ్చు. ఇలా ఈ డబుల్ ఎటాక్ కేసు మనకు ఎన్నో విషయాలు నేర్పుతోంది. మనల్ని వ్యాక్సిన్ వేయించుకోమని అలర్ట్ చేస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: