దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03, 2022 నుంచి ప్రారంభం అయ్యింది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Registration Process) ప్రారంభం కాగా, సగటున రోజుకు మూడు లక్షల మంది పేర్లను నమోదు చేయించుకున్నట్లయింది. అంతే కాకుండా తొలి రోజు రికార్డు స్థాయిలో టీనేజర్లు టీకాలు వేయించుకొన్నారు. దేశ వ్యాప్తంగా అధికారిక ప్రాథమిక గణాంకాల ప్రకారం తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు (First Dose) టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఈ టీకా పంపిణీ మరో మైలు రాయిని అందుకొంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలో రెండు కోట్ల మందికి టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాం డవీయ ట్వీట్టర్ (Twitter) వేదికగా వెల్లడించారు.
Shielding Young India against COVID-19 💉
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/QVmTDruWP0
— Ministry of Health (@MoHFW_INDIA) January 8, 2022
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Omicron, Omicron corona variant