భారతదేశంలో కోవిడ్-19 (Covid 19) కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది. తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో 12ఏళ్ల నుంచి వారికి కూడా వ్యాక్సిన్లను అందిస్తోంది. అన్ని రాష్ట్రాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ వ్యాక్సినేషన్ (Vaccination) డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం మొదలైన ఈ వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు న మహారాష్ట్ర జనవరి 15 వరకు 14.29 కోట్ల డోస్‌లను అందించింది. ఇది దేశం వ్యాక్సినేషన్ వాటాలో 9.13 శాతం అవ్వడం విశేషం. అయితే ఇప్పటి వరకు అత్యధిక టీకా వేసిన రాష్ట్రాల్లో మొదటి స్థానం ఉత్తర్ ప్రదేశ్ ఉంది. ఉత్తర్ ప్రదేశ్ ఇప్పటికే 17 కోట్ల డోస్‌లను అందించింది. జనవరి 15 నాటికి మహారాష్ట్రలో 8.46 కోట్ల మందికి మొదటి డోస్‌లు, 5.79 కోట్ల మందికి రెండో డోస్‌లు వేశారు. అలాగే, వారిలో 3.2 లక్షల మంది బూస్టర్ షాట్ (Booster Dose) లు తీశారు. అర్హులైన జనాభాలో 90 శాతం మందికి ఒక డోస్‌తో టీకాలు వేయబడ్డాయి మరియు మహారాష్ట్రలో 63 శాతం మందికి పూర్తిగా టీకాలు వేసుకొన్నారు.
Corona Treatment: చికిత్స విధానం మార్చాలి.. బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం: వైద్యులు
జనవరి 16, 2021న, రాష్ట్రంలో దాదాపు 300 కేంద్రాలలో ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య దాదాపు 8,000కు పెరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్రంలో అతిపెద్ద నగరమైన ముంబైలో అత్యధికంగా 1.87 కోట్ల డోస్‌లు వేశారు. ఆ తర్వాతి స్థానంలో పూణే (1.6 కోట్లు), థానే (1.17 కోట్లు) నాసిక్ (71 లక్షలు) మరియు నాగ్‌పూర్ (62 లక్షలు) ఉన్నాయి.
మరోవైపు దేశంలో కరోనా కేసుల ( Corona Cases) పెరుగుదల ఆగడం లేదు. ఈఈ నేపథ్యంలో ముం బయిలోని జస్లోక్ ఆస్ప త్రి వైద్యు డు డాక్టర్ సంజయ్ నాగ్రాల్, కేరళలోని రాజ్గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిరియక్ ఫిలిప్, బెంగళూరుకి చెందిన డాక్టర్ రాజనీ భట్, యూఎస్, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా విషయంలో సెకండ్ వేవ్ (Second Wave) సమయంలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని వైద్యులు (Doctors) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికిత్స విధానంలో మార్పులు అవసరం అని వారు అభిప్రాయ పడ్డారు.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
అవసరం లేకున్నా పరీక్షలు..
కొందరు వైద్యులు అవసరం లేకపోయినా సీటీ స్కాన్ (CT Scan), డీ-డైమర్ వంటి పరీక్షలు చేయించుకోవాలని బాధితులకు సూచిస్తున్నారు. ఇది బాధిత కుటుం బాలకు అదనపు ఆర్థిక భారంగా మారుతాయి. కొన్ని ఆస్ప త్రులు కొవిడ్ బాధితుల్ని భయపెట్టి ఆస్పత్రిలో చేరేలా చేస్తున్నాయి. దీంతో కరోనా (Corona) తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆస్పత్రిలో పడకలు అందుబాటులో లేకుండాపోతున్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Omicron, Omicron corona variant, Vaccination