ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సమాచారం ఎంతో అవసరం. అందులోనూ విశ్వసనీయత చాలా అవసరం. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న కరోనా (Corona) కేసుల సంఖ్య నుంచి టీకాలు ఎక్కడ వేస్తారు. ఎంత మంది టీకాలువేసుకొన్నారు. ఇటువంటి సమాచారాన్ని పొందేందుకు ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) విద్యార్థులు కొత్త పోర్టల్ ఏర్పాటు చేశారు. అదే covid19tracker.in పోర్టల్. ఈ పోర్ట్‌లో సమాచారం పది భాషల్లో లభిస్తుంది. సమాచారం విశ్వసనీయత కోసం డేటాను కోవిన్ (CoWin) పోర్టల్ నుంచి తీసుకొనేటా లింక్ చేశారు. కోవిడ్ 19ట్రాకర్ covid19india.org వెబ్సైట్ పబ్లిక్ కోడ్ బేస్ ఉపయోగించి రూపొందించారు. వెబ్సైట్ 2020లో ప్రారంభించబడింది, అయితే అక్టోబర్ 2021లో వెబ్‌సైట్‌ను నిలిపి వేశారు. “ఈ సమాచారం పరిశోధకులు, విద్యార్థులు, ప్రజలకు ఎంత కీలకమో తెలుసుకుని నవంబర్ 1, 2021 నుంచి తిరిగి పునరుద్ధరించారు. దీని నిర్వహణను IIT హైదరాబాద్ డైరెక్టర్ IIT-హైదరాబాద్‌లోని డెవలపర్ బృందానికి అప్పగించారు.
AIIMS Jobs : ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.. వేతనం రూ.. 1,42,506.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!
ఇది సమాచారం అందిండం మాత్రమే కాదు.. వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తోంది. ఈ అంశం IIT హైదరాబాద్ మెంబర్‌గా ఉన్న SUTRA కన్సార్టియం ద్వారా ఈ రూపొందించారు. అంచనాలతో పాటు హెచ్చరికలను కూడా ఈ పోర్టల్ అందిస్తుంది.
Omicron: నెమ్మదిగా పెరుగుతున్న కేసులు.. ఆంక్షల వలయంలోకి దేశాలు
ఈ అంశపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ B S మూర్తి మాట్లాడారు. “IIT హైదరాబాద్ ఈ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది భారతదేశంలోని COVID-19కి సంబంధించిన డేటాపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన వనరుగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Facebook: ఫేస్బుక్లో ఆర్మీ చీఫ్ మరణంపై అనుచిత పోస్టు చేసిన ఇద్దరిపై కేసు నమోదు
ఇటీవల సృష్టించబడినప్పటికీ గణనీయమైన ట్రాఫిక్ ఉందని చాలా మందిని ఆకర్షిస్తోందని అన్నారు. వాస్తవానికి, భారతదేశం కోసం Worldometers వెబ్సైట్ కేవలం రెండు మూలాధారాలను ఉపయోగిస్తుందని, మా సైట్ మరియు MoHFW. ఇంత తక్కువ సమయంలో ఇంత ఆకట్టుకునే సైట్‌ని తీసుకొచ్చినందుకు ప్రొఫెసర్ భీమార్జున రెడ్డి తమ్మా, అతని టీమ్‌కు ప్రొఫెసర్ విద్యాసాగర్‌ని మెంటార్షిప్ చేసినందుకు అభినందిస్తున్నానని ఆయన అన్నారు. కోవిడ్ 19కు సంబంధించిన అన్ని అంశాలపై నిరంతరాయంగా, తాజా డేటాను పొందడానికి భారతీయులు IIT హైదరాబాద్‌పై ఆధారపడవచ్చని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.