• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID 19 SECOND WAVE 500 DOCTORS HEALTH WORKERS TEST POSITIVE AT 2 LEADING PATNA HOSPITALS SU

Covid Cases: రెండు టాప్ ఆస్పత్రుల్లో 500 మంది డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు కరోనా..

Covid Cases: రెండు టాప్ ఆస్పత్రుల్లో 500 మంది డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు కరోనా..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా బారినపడిన చాలా మందికి వైద్యం కూడా అందని దుస్థతి నెలకొంది. చాలా మంది బెడ్స్ కోసం ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా బారినపడిన చాలా మందికి వైద్యం కూడా అందని దుస్థతి నెలకొంది. చాలా మంది బెడ్స్ కోసం ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిపై తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వైరస్ విజృంభణ మాత్రం తగ్గడం లేదు. గతేడాది కంటే రెట్టింపు వేగంతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా బిహార్ రాజధాని పాట్నాలోని రెండు టాప్ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న 500 మందికి పైగా వైద్యులు, హెల్త్ వర్కర్లు కరోనా బారిన పడ్డారు. అందులో ఒకటి పాట్నా ఎయిమ్స్ ఆస్పత్రి కాగా, మరోకటి పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH).

    పాట్నా ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సీఎం సింగ్ పీటీఐతో మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో మొత్తం 384 మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడించారు. వారిలో వైద్యులు, నర్సులు, శానిటైజేషన్ వర్కర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందు శేఖర్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పనిచేసే 125 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. వారిలో 70 మంది డాక్టర్లు, 55 మంది నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఇక, కరోనా వైరస్ సోకిన ఉద్యోగుల కోసం పీఎంసీహెచ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వారిని ఐసోలేషన్‌లో ఉంచింది.

    Covid Vaccine Registration: 18 ఏళ్లు నిండినవారికి కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..

    ఇక, బిహార్‌లో కోవిడ్ పెషేంట్లకు చికిత్స అందించడంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్, పీఎంసీహెచ్ కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ రెండు ఆస్పత్రుల్లో భారీగా కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇంతమొత్తంలో వైద్య సిబ్బందికి కరోనా సోకడం తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. ఇక, బిహార్‌లో నిన్న కొత్తగా 12,222 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,54,281కి చేరింది. తాజాగా కరోనాతో 56 మంది మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1,897కి చేరింది. బిహార్‌లో ప్రస్తుతం 63,745 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: