COVID 19 RESTRICTIONS ON PUNJAB RALLIES CAN BE HELD BUT SCHOOLS AND COLLEGES WILL BE CLOSED AND ALSO NIGHT CURFEW EVK
Covid 19 Restrictions: ర్యాలీలు చేసుకోవచ్చు.. కానీ స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తారు.. నైట్ కర్ఫ్యూ ఉంటుంది!
ప్రతీకాత్మక చిత్రం
Covid 19 Restrictions | దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షిక ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే పంజాబ్లో మాత్రం భిన్నంగా కోవిడ్ రూల్స్ పెట్టారు. ఎన్నికల నేపథ్యంలోనే ఇటువంటి రూల్స్ పెంటారన విమర్శలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షిక ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే పంజాబ్లో మాత్రం భిన్నంగా కోవిడ్ రూల్స్ పెట్టారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రతి రోజూ రాత్రి 10 గం టల నుం చి ఉదయం 5 గం టల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉం డనుం ది. బార్లు, సినిమా థియేటర్లు, మల్టిపెక్స్లు, షాపిం గ్ మాల్స్ , రెస్టారంట్లు, స్పాసెం టర్లు, మ్యూజియం లు, జూ వం టి ప్రదేశాలను 50% సామర్థ్యం తో నిర్వహించాలని ఆదేశించారు. క్రీడా ప్రాం గణాలు, స్విమ్మింగ్ పూల్స్ , జిమ్ సెంటర్లు (GYM Centers) పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రత్యక్ష తరగతులు మూసివేయాలని ఆదేశించారు. ఆన్లైన్ క్లాసులు (Online Classes) మాత్రం కొనసాగిం చొచ్చని స్పష్టం చేశారు.
అయితే అన్ని నిబంధనలు బాగున్నాయి. త్వరలో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలతో రాజకీయ సమావేశాలు, సభలపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించ లేదు. దీనిపై కొందరు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే కోవిడ్ తగ్గుతుందా అనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలు, సభలు చేపడితే దేశంలో థార్డ్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు భయపడుతున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజయకీయ పార్టీలు మాత్రం అందుకు సుముఖంగా లేవు.
దేశంలో కోవిడ్ 19 కేసుల (Covid 19 Cases) సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 124 మరణాలు సంభవించాయి. దీంతో 11,007 రికవరీలతో.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,830 కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం. మంగళవారం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. దేశంలో మహారాష్ట్ర (Maharashtra) లో అత్యధికంగా 568 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 382 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కేరళలో 185, రాజస్థాన్లో 174లో.. గుజరాత్ లో152 కేసులు వచ్చాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.