హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lions: ఆ సింహాల మీద ఓ కన్నేయండి... గుజరాత్‌లో కీలక ఆదేశం... ఎందుకంటే?

Lions: ఆ సింహాల మీద ఓ కన్నేయండి... గుజరాత్‌లో కీలక ఆదేశం... ఎందుకంటే?

ఆ సింహాల మీద ఓ కన్నేయండి... గుజరాత్‌లో కీలక ఆదేశం...(image credit - twitter)

ఆ సింహాల మీద ఓ కన్నేయండి... గుజరాత్‌లో కీలక ఆదేశం...(image credit - twitter)

Lions: ఆ సింహాలను చూసి అధికారులు భయపడుతున్నారు. వాటి దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే టెన్షన్ పెరుగుతోంది. అసలు అవి ఎలాంటి సింహాలు... ఎందుకు ఈ ఆదేశం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Covid 19: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రతిరోజు మూడు లక్షలకుపైగా కేసులు వస్తుండటంతో ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా జంతువులకు కూడా వ్యాపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గుజరాత్‌ అటవీ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని గిర్‌ సింహాల అభయారణ్యంతో పాటు ఇతర ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించింది. ముందు ఈ అభయారణ్యాలను షట్‌డౌన్‌ చేయడంతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని గుజరాత్‌ అటవీ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సిబ్బందికి ముందు యాంటీజెన్‌, RT-PCR టెస్టులు చేస్తారు. దీని కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టామనీ, గతంలో కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా టెస్టులు చేశామని జూనాఘడ్‌ అటవీశాఖ అధికారి, చీఫ్ కన్జర్వేటర్‌ డీటీ వసవద చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సింహాల ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని వసవద చెప్పారు. ‘సింహాల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు ఇక్కడి సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించలేదు. వాటికి ఏదైనా అనారోగ్యం వస్తే, చికిత్స చేసేందుకు శాసన్‌ ఆసుపత్రిని పూర్తిగా శానిటైజ్‌ చేయించాం. జూలోని సింహాల బోనుల్లో సైతం శానిటైజేషన్‌ చేస్తున్నాం’ అని వివరించారు.

అవసరమైతే శాసన్‌ ఆసుపత్రిలో రెస్క్యూ సెంటర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. మరోవైపు 20 శాతం అభయారణ్యం సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కరోనా సమయంలో సింహాలకు ఇబ్బంది లేకుండా రోడ్‌ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. గ్రేటర్‌ గిర్‌, ఇతర అభయారణ్యాల్లో ఈ చర్యలు చేపడతారు. స్థానిక సిబ్బంది, ప్రజలు, ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా అవసరమైన సమాచారం సేకరిస్తూ, సింహాల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అటవీ శాఖ చెబుతోంది.

ఇది కూడా చదవండి: Food and Eye Color: ఈ 9 ఆహారాల్లో ఏది తిన్నా... మీ కళ్ల రంగు మారిపోతుంది

గుజరాత్‌లో కరోనా కేసుల తాకిడి ఎక్కువగానే ఉంది. మే 3న కొత్తగా 12,820 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,07,422 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో 7,648 మంది కరోనాతో మృతి చెందారు. ఇక రికవరీ అయినవాళ్ల సంఖ్య 4,52,275గా ఉంది. యాక్టివ్ కేసులు 1,47,499 ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Published by:Krishna Kumar N
First published:

Tags: Corona virus, Covid-19, Gujarat, Lions

ఉత్తమ కథలు