దేశంలో కరోనా మూడో వేవ్ (Third Wave) మొదలైంది. రెండోవేవ్‌తో పోలిస్తే మృతల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే కరోనా కారణంగా ఎవరు ఎక్కువగా మృతి చెందుతున్నారు అనే అంశంపై మాక్స్ హెల్త్‌కేర్ అధ్యయనం చేసింది. రెండోవేవ్‌తో పోల్చినప్పుడు.. మూడోవేవ్‌లో మృతి చెందిన వారిలో కరోనా టీకా (Corona Vaccine) తీసుకోని వారే 60శాతం మంది ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. అంతేకాకుండా ఇలా మృతి చెందిన వారిలో ఎక్కువమంది 70 ఏళ్లపైబడినవారేనని అధ్యయనంలో వెల్లడైంది. చాలా మంది మృతులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపింది. గుండె (Heart), ఉపరితిత్తులు, కాలేయం, కెన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారే ఎక్కువగా మృతి చెందినట్టు సర్వే (Survey) వెల్లడించింది. టీకా తీసుకోవడం ద్వారా కరోనా మరణాలను ఆపవచ్చనే నిపుణుల మాటకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోంది.
Corona Cases: జైల్‌లో కరోనా కలకలం.. 262 మంది ఖైదీలకు పాజిటీవ్
ఇప్పటికైతే ఆక్సిజన్ వినియోగం తక్కువే..
కరోనా మూడో వేవ్‌కు సంబంధించి జనవరి 20, 2022వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు మాక్స్ హెల్త్ కేర్ తెలిపింది. మూడో వేవ్‌లో 23.4శాతం మంది మాత్రమే ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారని అధ్య యనం తెలిపింది. అయితే సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ వినియోగం 74శాతం ఉన్నట్టు.. ఫస్ట్ వేవ్‌లో 63 శాతం ఉన్నట్టు అధ్యనం తెలిపింది.
CoWin Portal: కోవిన్ రిజిస్ట్రేషన్‌లో మార్పులు.. ఇకపై మరింత వెసులుబాటు
ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చెక్ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా మరణించారు. ఆమె మరణించే వరకు ఆమె వ్యాక్సినేషన్ (Vaccination) వద్దు అనే ప్రచారం చేశారు. కరోనాకు విరుడుగా వ్యాక్సినేషన్ వద్దని శరీరంలో సహాజ సిద్ధంగా వృద్ధి చెందే రోగ నిరోధకత శక్తియే మేలు అంటూ ప్రత్యేకంగా ప్రచారం చేశారు.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
ఆమె భర్త, కొడుకు వ్యాక్సిన్ తీసుకున్నా హనా హోర్కా మాత్రం టీకాకు దూరంగా ఉన్నారు. అంతే కాకుండా శరీరంలో ఉండే సహాజ రోగ నిరోధక శక్తి ప్రభావం అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో హనా హోర్కా ఏరికోరి కరోనా తెచ్చుకున్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు సోషల్ మీడియా (Social Media) లో తన ఫాలోవర్స్‌తో ఆమె మాట్లాడింది. తనకు కరోనా వచ్చిందని, టీకా తీసుకోకపోయినా తాను దాన్ని జయించబోతున్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుడదని. వ్యాక్సినేషన్‌పై చెడు అభిప్రాయం ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ద్వారా ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.