విద్యార్థి రాసిన థియారి (ఫోటో క్రెడిట్ - ట్విట్టర్)
Viral Tweet | కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడులు మూత పడ్డాయి. చాలా చోట్ల ఆన్‌లైన్ క్లాస్‌లే సాగుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఇంటికే పరిమితం అవ్వడంతో చదువులు బాగా దెబ్బతిన్నాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి రాసిన థియరీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
కరోనా (Corona) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడులు మూత పడ్డాయి. చాలా చోట్ల ఆన్‌లైన్ క్లాస్‌లే సాగుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఇంటికే పరిమితం అవ్వడంతో చదువులు బాగా దెబ్బతిన్నాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి రాసిన థియరీ సోషల్ మీడియా (Social Media) లో తెగ చక్కర్లు కొడుతుంది. ద్యార్థి సర్ ఐజాక్ న్యూటన్ (Newton) కి సంబంధించిన నాల్గవ నియమం ప్రకారం కరోనా, పరిశోధనలు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనో తగ్గుముఖం పడుతోంది. అంతేకాదు దీన్ని ఒక సమీకరణాన్ని రూపంలో చూపించి మరీ వివరించి చెప్పాడు. పైగా 'కే' అనే ఒక స్టిరమైన వేరియబుల్ "వినాశనం"ను సూచిస్తుందని రాసుకొచ్చాడు.
ఇప్పడు ఈ విశ్లేషణపై జోక్‌లు పేలుతున్నాయి. విద్యార్థి (Student) ఇలా కరోనా విజృంభణను సమీకరణ రూపంలో వివరించిన పేపర్‌ను "కోవిడ్ కాల్ కా న్యూటన్ (న్యూటన్ ఆఫ్ కోవిడ్ టైమ్స్)” అనే క్యాప్షన్ జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
हॉल के केंद्र में बैठे व्यक्ति के छींकने से उसके 156 डिग्री कोण पर 200 मीटर दूर बैठा शख्स कोरोना संक्रमित हो जाता है, हॉल का क्षेत्रफल बताइये। अगर हॉल वृताकार है तो त्रिज्या भी निकालिये।
దీనిమీద పలువురు జోక్‌లు వేస్తూ రీట్వీట్‌లు చేస్తున్నారు. ఈ థియరీని సీబీఎస్ఈ సెలబస్‌లో చేర్చాలని సెటైర్లు వేస్తున్నారు. అయితే.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్ని కోవిడ్‌తో అల్లాడిపోతున్నాయి. ఒకనొక దశలో వ్యాక్సిన్లు లేక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడేమో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఆ వైరస్ తన తీరుని మార్చకుంటోంది. పైగా ఒక్కొక్కరిలో ఒక్కోలా మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇంత సీరియస్ విషయాన్ని సున్నితంగా చెప్పిన విద్యార్థి సృజనాత్మకతను మెచ్చుకొంటు పలువురు మెచ్చుకోవడం విశేషం.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.