కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi)పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం బ్రిటన్(britain) పర్యటనలో ఉన్న రాహుల్.. బీజేపీ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కెస్తున్నారని.. మైకులు ఆఫ్ చేస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి రాజేశాయి.. ఇతర దేశాల్లో రాహుల్ ఈ విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.. రాహుల్ వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించడమేనంటూ కాషాయ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పార్లమెంట్(parliament) అటెండెన్స్‌పై ఆసక్తికర గణాంకాలు బయటకువచ్చాయి. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్‌లో రాహుల్ అటెండెన్స్‌ను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
అసలు పార్లమెంట్‌లో మీ అటెండెన్స్ ఎంతో తెలుసా రాహుల్?
భారత్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా కంచన్ గుప్తా కొట్టిపారేశారు. పార్లమెంట్‌లో తమ మైక్‌లు పని చేస్తాయి.. కానీ వాటిని ఆన్ చేయలేమని.. తాను మాట్లాడుతున్నప్పుడు ఇది చాలాసార్లు జరిగిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు సైతం భారత్ పార్లమెంట్ సమావేశాలు మొత్తం జరిగాయని కంచన్ గుప్తా గుర్తు చేశారు. తన పేలవమైన పనితీరును కవర్ చేయడానికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్ అటెండెన్స్ డేటాను ట్వీట్ చేశారు.
చాలా తక్కువ అటెండెన్స్:
రాహుల్ గాంధీ పార్లమెంట్ హాజరు కేరళ సగటు కంటే చాలా తక్కువగా ఉందని కంచన్ గుప్తా వరుస ట్వీట్లలో ఆరోపించారు. జాతీయ సగటు కంటే కూడా ఆయన హాజరు శాతం చాలా తక్కువ అని విమర్శించారు. 2020లో పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో రాహుల్ గాంధీ హాజరు శాతం జీరోగా ఉందన్నారు. ఓవరాల్‌గా రాహుల్ పార్లమెంట్ అటెండెన్స్ 52శాతమేనని.. అదే సమయంలో మొత్తం ఎంపీల హాజరు శాతం 79గా ఉందన్నారు. భారత పార్లమెంటులో 2019 నుంచి 2023 మధ్య రాహుల్ గాంధీ 92 ప్రశ్నలు అడిగారని.. ఇందుకు సంబంధించి కేరళ ఎంపీల సగటు 216గా, జాతీయ సగటు 163గా ఉందని విమర్శించారు. సగటున భారత్ ఎంపీలు 68 చర్చల్లో పాల్గొంటే.. రాహుల్ గాంధీ స్కోర్ దారుణంగా 6 మాత్రమే ఉందని వరుస ట్వీట్లలో ఫైర్ అయ్యారు. దీంతో ట్విట్టర్‌లో బీజేపీ మద్దతుదారులు సైతం కంచన్ గుప్తా ట్వీట్లను రీట్వీట్ చేస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian parliament, Parliament, Rahul Gandhi