Covaxin: కోవాగ్జిన్ థర్డ్ ట్రయల్స్ ఫలితాలు విడుదల... వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే?

కోవాగ్జిన్ (image credit - twitter)

Covaxin: హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ సృష్టించిన కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు వచ్చాయి. వాటి ఆధారంగా ఆ వ్యాక్సిన్ ఎఫికసీ, ఓవరాల్ ఫలితం, డెల్టా వేరియంట్‌పై ఎలా పనిచేస్తుందనేది కంపెనీ తెలిపింది.

  • Share this:
    Covaxin: ఇండియాలో కోవిషీల్డ్ తర్వాత ఎక్కువగా సప్లై అవుతున్న వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఐతే... ఈ వ్యాక్సి్న్ అంతగా ప్రభావం చూపించట్లేదనీ... దీన్ని వేసుకుంటే... కనీసం జ్వరం కూడా రావట్లేదనీ... చాలా మంది ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు. ఈ పరిస్థితుల్లో మూడో దశ ట్రయల్స్ ఫలితాల రిపోర్టును కంపెనీ రిలీజ్ చేసింది... దాని ప్రకారం... ఈ వ్యాక్సిన్ ఓవరాల్‌గా 78 శాతం సమర్థత కలిగివుందని తెలిసింది. అలాగే... ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న డెల్టా వేరియంట్ [B.1.617.2 (Delta)] విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యం (efficacy)తో పనిచేస్తున్నట్లు తేలింది. దీన్ని తయారుచేసిన హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ ఈ వివరాలు శనివారం తెలిపింది.

    కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ కంపెనీ... మెడ్‌జివ్ (medRxiv)లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎఫికసీ ట్రయల్‌లో కోవాగ్జిన్ సేఫ్ వ్యాక్సిన్ అని రుజువైంది అని కంపెనీ తెలిపింది.

    నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే... జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. "వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరూ చనిపోలేదు. కరోనా తెచ్చే కోవిడ్ వ్యాధిని నిర్మూలించడంలో... ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసింది. ముఖ్యంగా పెద్దవాళ్లలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా పనిచేసింది." అని కంపెనీ తెలిపింది.


    మొత్తం 146 రోజులపాటూ... వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా... అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లు అయ్యింది అని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.

    మొత్తం 25 భారత ఆస్పత్రుల్లో మూడో ట్రయల్స్ జరిగాయి. ఇందులో వ్యాక్సిన్ సామర్ధ్యం, సురక్షితమా కాదా... వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోంది అనే అంశాల్ని పరిశీలించారు. తీవ్రమైన కేసుల్లో ఇది 93.4 శాతం సమర్థతతో పనిచేస్తోందని కంపెనీ తెలిపింది.

    ఇది కూడా చదవండి: Video: కప్పను ఎత్తుకుపోయిన కందిరీగ... ఏనాడైనా చూశామా... కలియుగ వింత!

    మూడో ట్రయల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి కాబట్టి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత వేగంగా చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: