Home /News /national /

COVAXIN MAY BE MORE EFFECTIVE AGAINST OMICRON COVID VARIANT THAN OTHER VACCINES SAYS ICMR HERE IS HOW JNK GH

Covaxin: ఒమిక్రాన్​ వేరియంట్​పై ప్రభావవంతంగా పనిచేస్తున్న కోవాగ్జిన్​.. గుడ్​న్యూస్​ చెప్పిన ఐసీఎంఆర్

ఒమిక్రాన్ వేరియంట్‌పై సమర్దవంతంగా పని చేస్తున్న కోవాక్సిన్ (PC: Money Control)

ఒమిక్రాన్ వేరియంట్‌పై సమర్దవంతంగా పని చేస్తున్న కోవాక్సిన్ (PC: Money Control)

Covaxin: రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్​).

ఇంకా చదవండి ...
దక్షిణాఫ్రికాలో (South Africa) బయటపడ్డ కోవిడ్​ (Covid) కొత్త వేరియంట్ (Variant) ఒమిక్రాన్​ (Omicron) అందర్నీ కలవరపెడుతుంది. ఇప్పటికే 28 దేశాలకు పాకిన ఈ వైరస్​.. నిన్న మన దేశంలోకి కూడా అడుగుపెట్టేసింది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి ఈ వైరస్​ (Virus) సోకింది. దీంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్​ (Vaccine) తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్​) (ICMR). హైదరాబాద్​లోని భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' ఒమిక్రాన్​కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని గుడ్​న్యూస్​ చెప్పింది. అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్​ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది.

దీనిపై ఐసీఎంఆర్​ అధికారి మాట్లాడుతూ ‘‘కోవాగ్జిన్ అనేది వైరియన్ -ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇది మొత్తం వైరస్‌ను అంతం చేసేలా కవర్ చేస్తుంది. ఇది అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది.” అని వివరించారు. కోవాగ్జిన్ కేవలం ఒమిక్రాన్​పైనే కాదు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒమిక్రాన్​పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు​ మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

India Corona Updates: ఒమిక్రాన్ వేళ భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే..


* మరిన్ని పరిశోధనలు అవసరం..
దీనిపై మరో​ అధికారి మాట్లాడుతూ ‘‘కోవాగ్జిన్​ ఒమిక్రాన్​ వేరియంట్​కు వ్యతిరేకంగా మనకు​ రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కొన్ని శాంపిల్స్​ స్వీకరించి పరిశోధన చేశాం. మరిన్ని శాంపిల్స్​ను స్వీకరించిన తర్వాత, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)లో వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తాం. ఆ తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.” అని తెలిపారు.

Omicron: దేశంలో కరోనా ఒమిక్రాన్ సోకిన ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి ? అసలు ఆ ఇద్దరు ఎవరు ?



 చైనాలోని వుహాన్‌లో ల్యాబరేటరీస్​లో బయటపడ్డ కరోనా మొదటి వేరియంట్‌కు వ్యతిరేకంగా భారత్​ బయోటెక్​ కోవాగ్జిన్​ను అభివృద్ధి చేసింది. అయితే ఇది ఇతర వేరియంట్లపై కూడా బాగా పని చేయగలదని అనేక పరిశోధనల్లో తేలింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్​ mRNA (మోడర్నా, ఫైజర్), అడెనోవెక్టర్ వ్యాక్సిన్లు (స్పుత్నిక్, ఆస్ట్రాజెనెకా) వంటి స్పైక్ ప్రోటీన్​ వాక్సిన్ల కంటే అన్ని యాంటిజెన్లు, ఎపిటోప్‌లపై బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా మనకు మెరుగైన రక్షణను ఇస్తుంది. ఒమిక్రాన్ తీవ్రత మరీ ఎక్కువగా లేదని, అందువల్ల ఇతర వ్యాక్సిన్లు సైతం దీని నుంచి రక్షణ కల్పిస్తాయని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.


(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Covaxin, ICMR, Omicron, Omicron corona variant, Vaccination

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు