Home /News /national /

COVAXIN FROM INDIAS BHARAT BIOTECH EFFECTIVELY NEUTRALISES DELTA AND ALPHA VARIANTS OF COVID SAYS US NATIONAL INSTITUTE OF HEALTH NK

Covaxin: డెల్టా వేరియంట్‌ను చంపేసిన కోవాగ్జిన్... అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడి

డెల్టా వేరియంట్‌ను చంపేసిన కోవాగ్జిన్... అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడి (image credit - twitter)

డెల్టా వేరియంట్‌ను చంపేసిన కోవాగ్జిన్... అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడి (image credit - twitter)

Covaxin: మిగతా వ్యాక్సిన్లతో పోల్చితే... కోవాగ్జిన్ అంత శక్తిమంతంగా లేదు అని విమర్శలు వస్తున్న తరుణంలో... కోవాగ్జిన్ చాలా శక్తిమంతంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.

    Covaxin: ప్రపంచ దేశాలకు ఇప్పుడు కావాల్సింది సాదా సీదా కరోనా వ్యాక్సిన్ కాదు. డెల్టా వేరియంట్‌ను చంపగల వ్యాక్సిన్ కావాలి. ఈ విషయంలో హైదరాబాద్ భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్న కోవాగ్జిన్ అత్యంత సమర్థంగా పనిచేస్తోందని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) తెలిపింది. భారత్ బయోటెక్... ఈ వ్యాక్సిన్‌ని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) సహకారంతో తయారుచేసింది. ఈ వ్యాక్సిన్ UKలో వచ్చిన ఆల్ఫా (B.1.1.7), ఇండియాలో బయటపడిన డెల్టా (B.1.617)... వేరియంట్లను బలహీనం (neutralise) చెయ్యడంలో బాగా పనిచేస్తోందని NIH చెప్పింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలపై NIH రెండు రకాల అధ్యయనాలు చేసింది. ఆ ప్రజల్లో వ్యాక్సిన్ తీసుకున్నాక... బ్లడ్ సీరం శాంపిళ్లను పరిశీలించగా యాంటీబాడీలు పెరిగాయి. అవి ఆల్ఫా, డెల్టాను ప్రభావవంతంగా ఎదుర్కొని నాశనం (neutralise) చేశాయని తెలిపింది.

    అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థకు అమెరికాలో మంచి పేరు ఉంది. ఇది ఇండియాతో బలమైన సైంటిఫిక్ సహకారం కలిగివుంది. కోవాగ్జిన్ అభివృద్ధిలో నిధులను ఇవ్వడం ద్వారా ఈ సంస్థ కూడా పాలుపంచుకుంది. వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసేందుకు కావాల్సిన ఎడ్జువాంట్స్ (Adjuvants) తయారీలో NIH నిధులు ఇచ్చింది. ఐతే... ఇప్పటివరకు ఇండియాలో కోవాగ్జిన్‌ను 2.5 కోట్ల మందికే వేశారు. దానికి తోడు... యూరప్ దేశాల్లో కోవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌గా గుర్తించట్లేదు. అందువల్ల భారతీయుల్లో కూడా ఈ వ్యాక్సిన్ పట్ల ఒకింత ఆసక్తి తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.



    కోవాగ్జిన్‌లో... 2020లో వచ్చిన కరోనా వైరస్ తాలూకు... డూప్లికేట్ పాథోజెన్ ఉంటుంది. అలాంటి వైరస్ బాడీలోకి వస్తే... యాంటీబాడీలు దాన్ని గుర్తించి చంపగలవు. కానీ ఇప్పుడున్న డెల్టా, ఆల్ఫాలు... గతేడాది వచ్చన కరోనా వైరస్ లాంటివి కావు. వాటిలో కొన్ని మార్పులొచ్చాయి. అయినప్పటికీ... యాంటీబాడీలు వాటిని కూడా గుర్తించి చంపగలుగుతున్నాయని NIH తెలిపింది. రెండో దశ ట్రయల్స్‌ ఫలితాలను బట్టీ... ఈ వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదని తెలుస్తోందని NIH వివరించింది. ముూడో దశ ఫలితాలు... వచ్చే సంవత్సరం వస్తాయని తెలిపింది.

    ఇది కూడా చదవండి:Shocking: రూ.90,000 ఐఫోన్ ఆర్డర్ ఇస్తే.. ఖాళీ పేపర్ వచ్చింది.. బిత్తరపోయిన టీవీ స్టార్

    "పబ్లిష్ చెయ్యని మధ్యంతర ఫలితాలను బట్టీ... మూడో దశ ట్రయల్స్‌లో... కరోనా లక్షణాలు ఉన్నవారికి కోవాగ్జిన్ 78 శాతం సమర్థతతో పనిచేస్తోంది. అదే కరోనా తీవ్రంగా ఉన్నవారికి, ఆస్పత్రుల్లో చేరిన వారికి 100 శాతం సమర్థతతో పనిచేస్తోంది. అలాగే... లక్షణాలు కనిపించని వారి విషయంలో 70 శాతం సమర్థతతో పనిచేస్తోంది." అని NIH తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Coronavirus, Covaxin, Covid-19

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు