Couple reunited after 52 years of divorce : ప్రేమ(Love) గుడ్డిది అని అంటుంటారు. అందుకే ప్రేమ రంగు,ఆస్తులు చూసి కాకుండా మనసును చూసి పుడుతుంది అని అంటుంటారు. కొన్ని ప్రేమ బంధాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో నడుస్తున్న ప్రేమ వ్యహరాలు వేరే. ప్రేమ అనే పేరుతో తమ లైంగిక కోరికలు తీర్చుకునేవారే ఎక్కువయ్యారు నేటి రోజుల్లో. ఇదిలా ఉండే వయసులో ఉన్నప్పుడు తమ ప్రేమించిన వారిని కుటుంబం కోసం త్యాగం చేసిన వారు ఇటీవలి కాలంలో వృద్ధాప్యంలో మాత్రం ప్రేమించిన వారిని మరిచిపోలేక పెళ్లి చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కర్ణాటక(Karnataka)లోని మైసూర్ జిల్లాలో కూడా ఇలాంటి వివాహమే ఒకటి జరిగి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక,అదే సమయంలో వృద్ధాప్యంలో పుట్టిన ప్రేమను సైతం గెలిపించుకోవడానికి ఎంతోమంది పిల్లలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా సోషల్ మీడియాలో(Social Media) హాట్ టాపిక్ గా మారి పోతున్నాయ్. అయితే ఇలా ప్రేమికులు విడిపోయి మళ్ళీ కలవడం లాంటివి చూశాం. అయితే ఇప్పుడు యవ్వనంలో విడాకులతో విడిపోయిన దంపతులు.. వృద్ధాప్యంలో మళ్లీ ఒక్కయ్యారు. 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఈ దంపతులు ఇప్పుడు మళ్లీ కలిసి జీవించాలనుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు ఒక్కటయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన బసప్ప అగడి( 85), కల్లవ అగడి(80)దంపతులు... పెళ్లయిన కొద్ది సంవత్సరాలకు విడాకులు(Divorce) తీసుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని వీరు విడిపోయారు. అప్పటినుంచి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. అయితే విడాకుల సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు..బసప్ప భార్యకు భరణం చెల్లిస్తూ నే ఉన్నాడు. ఈ మధ్య కొద్ది నెలలుగా భరణం ఇవ్వడం ఆపేసాడు. దీంతో కలవ్వ కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం లోక్ అదాలత్ లో ఈ కేసును పరిష్కరించాలని అనుకుంది. అయితే న్యాయమూర్తి ఈ వృద్ధ జంటను చూసి షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించేందుకు ఒప్పించారు. మళ్లీ కలిసి జీవించేందుకు వారు ఒప్పుకున్నారు. శనివారం మైసూర్లో విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోవాలనుకున్న మొత్తం 38 జంటలను లోక్ అదాలత్ ద్వారా తిరిగి కలిపారు. భార్యభర్తల మధ్య రాజీ కుదిర్చి వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశారు. కాగా,అధికారుల లెక్కల ప్రకారం మైసూర్ సిటీ, తాలూకా కోర్టుల్లో మొత్తం 150,633 కేసులు పెండింగ్ లో ఉండగా వీటిలో 70,281 కేసులు రాజీ ద్వారా పరిష్కృతం కానున్నాయి. వీటిలో భాగంగానే కొన్ని కుటుంబ గొడవలను కూడా పరిష్కరించారు.
Walk forr fitness : వాకింగ్ తో బోలెడు ప్రయోజనాలు...ఫిట్ నెస్ కోసం ప్రతి రోజూ ఎంత నడవాలో తెలుసా
Diabetes : షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలి..ఏం తినకూడదు!
ఇటీవల కాలంలో ఒక్కసారి విడాకులతో భార్య భర్తలు విడిపోయిన తర్వాత ఎవరి దారి వారిది అన్నట్లుగానే బ్రతికేస్తున్నారు. కనీసం విడాకులు తీసుకోకుండా భర్త తో సంతోషంగా ఉన్నాము.. కొన్ని రోజులు గడిపాను అన్న విషయం కూడా మరిచిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇటువంటి సమయంలో 52 ఏళ్ల క్రితం విడిపోయి..ఇప్పుడు మళ్లీ కలిసిన బసప్ప-కల్లవ దంపతుల స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Divorce couple, Karnataka