హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Embryo Import: పిండాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి.. కోర్టుకెక్కిన ముంబై దంపతులు

Embryo Import: పిండాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి.. కోర్టుకెక్కిన ముంబై దంపతులు

ముంబై హైకోర్టు

ముంబై హైకోర్టు

ముంబైకి చెందిన దంపతులు ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా వారు గత కొద్ది సంవత్సరాలుగా సంతానానికి దూరంగా ఉంటున్నారు.

ముంబైకి చెందిన దంపతులు ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా వారు గత కొద్ది సంవత్సరాలుగా సంతానానికి దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్ళ క్రితం ముంబైకి చెందిన దంపతులు ఫ్లోరిడాలోని ల్యాబ్‌లో వైద్య విధానంలో తమ పిండాన్ని(embryo) భద్రపర్చుకున్నారు. ఈ పిండాన్ని ఇండియాకి తీసుకురావడానికి అనుమతి కోరుతూ వారు బాంబే హైకోర్టులో(హే ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల వీరి పిటిషన్‌ విచారణకు రావడంతో బాంబే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇతర విభాగాలకు బాంబే హైకోర్టు(Bombay High Court) సోమవారం నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం సంతానం లేని ఈ 40 ఏళ్ల దంపతులు 2014లో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) ని ఆశ్రయించారు. ఆ సమయంలో భారతీయ నియమాలు సరోగసీ కోసం పిండం దిగుమతి చేసుకోవడానికి అనుమతించాయి. ఈ విషయాలను వారి న్యాయవాది నితిన్ ప్రధాన్.. న్యాయమూర్తులు ఉజ్జల్ భుయాన్, మాధవ్ జమ్‌దార్ ధర్మసానానికి వెల్లడించారు. ఈ క్రమంలోనే అత్యవసరంగా వివరణాత్మక విచారణ కోసం హైకోర్టు దంపతుల పిటిషన్‌ను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.

Telangana Schools Reopen: రేపటి నుంచే స్కూల్స్ రీ-ఓపెన్.. వాటికి మాత్రం నో.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్


ఈ దంపతులు మార్చి 2016 నాటికి అసిస్టెడ్ టెక్ ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు అవకాశం వచ్చింది. ఆ ఏడాది నుంచి పిండాన్ని (embryo) ఫ్లోరిడాలోని ల్యాబ్‌లోనే క్రియో పద్ధతిలో భద్రపరిచారు. ఈలోగా 2015 అక్టోబర్‌లో ఈ విధానానికి సంబంధించి భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు తెల్చింది. పిండాల దిగుమతుల నిబంధనలను మార్చింది. శాస్త్రీయ పరిశోధన కోసం తప్పించి మానవ పిండాలను దిగుమతి చేయడానికి వీలులేదు అన్నట్లు ఈ నిబంధనలు ఉన్నాయి. 2018లో ఇండియాకి తిరిగి వచ్చేసిన ఈ జంట 2015 నోటిఫికేషన్‌ను సవాలు చేశారు.

Kamareddy: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..


గడ్డకట్టిన (Frozen) పిండాన్ని తీసుకు రావడం పై బ్యాన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. 2015 నోటిఫికేషన్‌ని చట్టవిరుద్ధంగా భావించి రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ 5 సంవత్సరాల పిండాన్ని అనుమతించాలని ఆదేశిస్తున్నారు. పిండంపై సరోగసీ విధానాన్ని ప్రారంభించడానికి దిగుమతికి అనుమతించాలని దంపతులు కోరుతున్నారు.

జీవసంబంధమైన బిడ్డను కలిగి ఉండే తమ హక్కును "ఎగ్జిక్యూటివ్ ఫియట్" ద్వారా అరికట్టలేమని పిటిషన్లో దంపతులు పేర్కొన్నారు. సరోగసీ కోసం పిండం పరిరక్షణ, దిగుమతిని నిషేధించే చట్టపరమైన చట్టం ఏదీ లేదని తమ పిటిషన్ లో వివరించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 2015 నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది.

పిండాన్ని దిగుమతి చేసుకోవడానికి సుప్రీం కోర్టు డిసెంబర్ 2015 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. కానీ కేంద్రం, ఐసీఎంఆర్ ఇప్పటి వరకు మార్గదర్శకాలను జారీ చేయలేదని దంపతుల న్యాయవాది వెల్లడించారు. ఇక ఆ తర్వాత దంపతులు ప్రదేశానికి తిరిగి వచ్చే విజ్ఞప్తులు చేసుకున్నా.. ఐసీఎంఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అద్దె గర్భం లేదా సరోగసీని నియంత్రించడానికి ఇండియాలో రెండు ప్రతిపాదిత చట్టాలు ఉన్నాయి. ఇవి బిల్లులే కానీ శాసనాలు కాదు. 2020 ART (నియంత్రణ) బిల్లును.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం స్టాండింగ్ కమిటీకి పంపించారు. ఇక ART బిల్లు.. భారతదేశంలో చికిత్స ప్రయోజనాల కోసం పిండాన్ని దిగుమతి చేసుకోవడానికి ఎగుమతి చేయడానికి సిఫార్సు చేసినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.

First published:

Tags: Bombay high court, Mumbai