• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COUPLE DONATES BLOOD ON WEDDING DAY TO SAVE YOUNG GIRL SU

రియల్లీ గ్రేట్.. పెళ్లి పీటలపై నుంచి వచ్చి యువతి ప్రాణాలను కాపాడారు..

రియల్లీ గ్రేట్.. పెళ్లి పీటలపై నుంచి వచ్చి యువతి ప్రాణాలను కాపాడారు..

(Image-Twitter)

జనరల్‌గా పెళ్లి వేడుక అంటే హడావిడి మాములుగా ఉండదు. ఇక, పెళ్లి రోజు పెళ్లికొడుకు, పెళ్లికూతురు క్షణం తీరిగా లేకుండా గడుపుతారు.

  • Share this:
    జనరల్‌గా పెళ్లి వేడుక అంటే హడావిడి మాములుగా ఉండదు. ఇక, పెళ్లి రోజు పెళ్లికొడుకు, పెళ్లికూతురు క్షణం తీరిగా లేకుండా గడుపుతారు. బంధువులను, స్నేహితుల ఆశీస్సులతో జీవితంలో కొత్త ప్రయాణానికి స్వాగతం పలుకుతారు. ఆ రోజును తమ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఓ జంట పెళ్లి రోజున చేసిన పని వారిని ఇతరులు గుర్తుంచుకునేలా చేసింది. పెళ్లి పీటల మీద లేచి వచ్చిన దంపతులు రక్తదానం చేసి  యువతి ప్రాణాలను కాపాడారు. అయితే ఎంత బీజిగా ఉన్నప్పటికీ.. ఆ జంట పెళ్లి రోజున చేసిన పనిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి అశిశ్ మిశ్రా తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. అశిశ్ మిశ్రా పోలీస్ మిత్రా క్యాంపెయిన్ ద్వారా రక్తం అవసరమైన పెషేంట్లకు దానిని సమకూర్చేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఓ యువతి ప్రాణాలు కాపాడటానికి ఓ జంట పెళ్లి వేదిక నుంచి నేరుగా వచ్చి రక్తదానం చేసింది.

    పెళ్లి దుస్తులు ధరించి ఉన్న సమయంలో రక్తదానం చేస్తున్న నూతన వధూవరుల ఫొటోను అశిశ్ షేర్ చేశారు. ఆ చిత్రంలో వరుడు రక్తదానం చేస్తుండగా.. వధువు అతని పక్కనే నిల్చుని ఉంది. అలాగే హిందీలో ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు.'' నా భారతదేశం చాలా గొప్పది. ఓ యువతికి రక్తం దానం చేసేవారి అవసరం పడింది. కానీ ఆమెకు రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆమె వేరొకరి బిడ్డ కాబట్టి. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ జంట బాలికకు రక్తం అందించడానికి ముందకొచ్చారు. వారి పెళ్లి రోజు అయినా కూడా సమయం చూసుకుని రక్తదానం చేశారు. వారికి బిగ్ సెల్యూట్. ఆ జంటకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను" అని పేర్కొన్నారు. అయితే ఆ జంట వివరాలను మాత్రం అశిశ్ వెల్లడించలేదు.





    ఇక, పెళ్లి రోజున రక్తదానం చేసి యువతి ప్రాణాలను కాపాడిన జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక, అశిశ్ పోలీస్ మిత్రా క్యాంపెయిన్‌ను 2017లో ప్రారంభించారు. దీని ద్వారా పెషేంట్లును రక్తదాతలతో కనెక్ట్ చేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడవచ్చనే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: