COUNTRYS TALLEST IDOL OF BUDDHA BUILT IN BIHARS BODHGAYA MS GH
Tallest Buddha Statue: దేశంలోనే అతి ఎత్తైన బుద్ధ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు.. ఎక్కడో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Tallest Buddha Statue: మట్టితో తయారు చేస్తున్న ఈ ఎత్తైన బుద్ధ విగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. బెంగాల్ కు చెందిన మింటూ పాల్ అనే క్లే మోడలర్ దీన్ని తయారు చేస్తున్నాడు.
దేశంలోనే అత్యంత ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ బుద్ద విగ్రహం తయారీ పనులు చకచకా జరుగుతున్నాయి. మట్టితో తయారు చేస్తున్న ఈ ఎత్తైన బుద్ధ విగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. బెంగాల్ కు చెందిన మింటూ పాల్ అనే క్లే మోడలర్ దీన్ని తయారు చేస్తున్నాడు. అతనికి ఇది వరకే అనేక విగ్రహాలను తయారు చేసిన అనుభవం ఉంది. 2015లో కోల్కతాలో నెలకొల్పిన 80 అడుగుల అతి పొడవైన దుర్గా విగ్రహాన్ని కూడా మింటూ పాల్నే తయారు చేశాడు. అయితే, ప్రస్తుతం పాల్ తయారు చేస్తున్న బుద్ధ విగ్రహం పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
ఈ అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని 2022లో బీహార్ లోని బోధ్ గయాలో గల ప్రముఖ బౌద్ధ ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా, బారానగర్ లోని ఘోష్పారా మైదానంలో దీని తయారీ పనులు చకచగా జరుగుతున్నాయి. మట్టి, ఫైబర్ సమ్మేళనంతో తయారు చేస్తున్న ఈ విగ్రహాన్ని వచ్చే ఏడాది బుద్ధ పూర్ణిమ రోజు బోధ్ గయ బౌద్ధ ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు, ఈ విగ్రహం తయారీ వెనుక బుద్ధ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ మిషన్ సహకారం ఎంతో ఉందని పాల్ చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహం కాబోతుందని పేర్కొన్నారు.
2022లో బోధ్ గయా బౌద్ధ ఆలయంలో ఏర్పాటు..
బుద్ధ విగ్రహ తయారీపై మింటూ పాల్ మాట్లాడుతూ "విగ్రహ తయారీ పనులు సజావుగా జరుగుతున్నాయి. అయితే వేర్వేరు భాగాలను అతికించి, విగ్రహ తయారీని పూర్తి చేయడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత విగ్రహాన్ని బోధ్గయాలోని బౌద్ధ ఆలయానికి తరలిస్తాం." అని చెప్పారు. కాగా, 2015లో కోల్కతా నగరంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన దుర్గా విగ్రహాన్ని కూడా మింటూ పాల్నే తయారు చేయడం విశేషం. 80 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహాన్ని కోల్కతా నగరంలోని దేశాప్రియ పార్క్ లో ఏర్పాటు చేశారు.