Home /News /national /

COUNSELLORS CLEAR LANGUAGE HURDLE AND REUNITE DEAF COUPLE IN GUJARAT PVN

Intresting : మాట రాని మౌనమిది..చదివాకా చప్పట్లు కొట్టించే కథ ఈమెది

విడిపోయి మళ్లీ కలిసిన దివ్యాంగ దంపతులు

విడిపోయి మళ్లీ కలిసిన దివ్యాంగ దంపతులు

Deaf couple in gujarat  :ఊరు గాని ఊరు..భాష తెలియదు..పైగా చెవుడు,మూగ కూడా. సోషల్ మీడియాలో పరిచమైన వ్యక్తిని నమ్మి కర్ణాటక నుంచి గుజరాత్ వరకు వెళ్లి అతడిని పెళ్లి చేసుకుంది. ఆమె భర్తకు కూడా చెవులు వినడబవు,మాటలు రావు. అయితే భర్త స్నేహితులతో గొడవపడి ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా మర్చిపోయి వెళ్లిపోయింది.

ఇంకా చదవండి ...
Deaf couple in gujarat  :ఊరు గాని ఊరు..భాష తెలియదు..పైగా చెవుడు,మూగ కూడా. సోషల్ మీడియాలో పరిచమైన వ్యక్తిని నమ్మి కర్ణాటక నుంచి గుజరాత్ వరకు వెళ్లి అతడిని పెళ్లి చేసుకుంది. ఆమె భర్తకు కూడా చెవులు వినడబవు,మాటలు రావు. అయితే భర్త స్నేహితులతో గొడవపడి ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా మర్చిపోయి వెళ్లిపోయింది. ఎటు పోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషన్ లో కూర్చుండిపోయింది. భార్య కోసం ఊరంతా తిరుగుతూనే ఉన్నాడు భర్త. అయితే చివరకు ఈ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు, అయితే ఈ దంపతులు మళ్లీ కలవడం అంత ఈజీగా జరగలేదు. అసలు వీరి పెళ్లిలో కూడా ఓ సినిమా కథని తలపించే ట్విస్ట్ ఉంది మరీ.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు చెందిన 29 ఏళ్ల యువతి దివ్వాంగురాలు. ఆమెకి మాటలు రావు, చెవులు వినబడవు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహమై నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. అయితే భర్తతో గొడవ కారణంగా ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆమెకు ఫేస్ బుక్ లో గతేడాది ఓ రోజు గుజరాత్ కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత అతడు పెట్టే మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మొదలుపెట్టింది. అతడు కూడా ఆమె లాగే దివ్వాంగుడే. అతడికి కూడా మాటలు రావు, చెవులు వినబడవు. అయితే మెసేజ్ ల రూపంలో సోషల్ మీడియా మొదలైన వీరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా చిగురించింది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోపోయేదాకా ఫేస్ బుక్ లో ఊసులు చెప్పుకునేవారు. స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు ఎక్సేంజ్ చేసుకున్నారు. వాట్సాప్ లో చాటింగ్,వీడియో కాల్స్ ద్వారా మరింత దగ్గరయ్యారు. గాఢమైన ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్నేహితుడితో మైసూర్ వెళ్లిన ఆ వ్యక్తి..మహిళను తీసుకొని గుజరాత్ లోని తన సొంతూరు పాలన్ పూర్ కి వెళ్లాడు.

ALSO READ Covid Update : తగ్గిన కోవిడ్ కేసులు,పెరిగిన మరణాలు

పాలన్ పూర్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరూ దివ్యాంగులు పెళ్లి చేసుకున్నారు. అయితే హాయిగా కాపురం సాగిపోతున్న సమయంలో సోమవారం(ఏప్రిల్ 11)భర్యను అదే ఊరులో కాపురముంటున్న తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు భర్త. అక్కడ ఆమెకు..ఆ దంపతులతో గొడవ జరిగింది. దీంతో ఆ దివ్వాంగురాలు కోపంలో సెల్ ఫోన్ కూడా మర్చిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తెలియని ఊరిలో ఎటు వెళ్లాలో తోచక అటూ ఇటూ తిరుగుతూ పాలన్ పూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. ఒంటరిగా స్టేషన్ లో కూర్చొని మౌనంగా రోదిస్తున్న ఆమెను చూసిన ఒకరు అభయమ్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేశారు. వెంటనే వాలంటీర్లు రైల్వే స్టేషన్ కు చేరుకొని మహిళను కనిపెట్టారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా..ఆమెకు మూగ,చెవుడు అని వారికి అర్థమయ్యింది.

ALSO READ Viral Video : ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఆ మహిళ కేవలం కన్నడ భాషలోనే కమ్యూనికేట్ చేయగలదని గుర్తించారు. చివరకు ఆ మహిళ ఓ పేపర్ మీద కన్నడ భాషలో తన భర్త,కామన్ ఫ్రెండ్స్ పేర్లు రాసింది. కొద్దసేపు తన ఫోన్ నెంబర్ కూడా మర్చిపోయిన ఆ మహిళ..ఎట్టకేలకు గర్తుకుతెచ్చుకొని తన భర్త ఫోన్ నెంబర్ కూడా పేపర్ పై రాయడంతో..ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్ సాయంతో పోలీసులు ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆమె భర్తను వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ అవగలిగారు. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు భర్త. భర్తను చూడగానే భార్య కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. తనతో పాటు భార్యను ఇంటికి తీసుకెళ్లడంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gujarat, WOMAN

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు