ఇంటర్ తర్వాత ఏం చేయాలి? ఎందులో జాయిన్ అయితే మంచి కెరీర్ అవకాశాలు ఉంటాయి? ఈ అంశాలపై విద్యార్థులకు అంతగా అవగాహన ఉండదు. చాలా మంది విద్యార్థులు తమ ఆలోచనలకు భిన్నమైన కోర్సుల్లో చేరిపోతున్నారు. అందుకే 11, 12వ తరగతి చదువుకునే విద్యార్థులకు కచ్చితంగా కెరీర్ గైడెన్స్ అవసరమని ఢిల్లీ హైకోర్ట్ (Delhi High Court)చెబుతోంది. ఆ స్థాయిలోనే వారికి ఒక సరైన కెరీర్ కౌన్సెలింగ్ వ్యవస్థ తప్పక ఉండాలని పేర్కొంది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని సంబంధిత అధికారులకు సూచించింది.
* కెరీర్ గైడెన్స్ అందించాలని ప్రభుత్వానికి సూచన
ఓ ప్రతిభావంతుడైన విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ లో(Delhi University) అడ్మిషన్ పొందలేకపోయాడు. ఎందుకంటే అతను 11, 12 తరగతుల్లో తీసుకున్న సబ్జెక్టులను యూనివర్సిటీలో మెయిన్ సబ్జెక్టులుగా పరిగణించలేదు. ఈ విషయంపై పాఠశాల కూడా అతనికి ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. దీంతో అడ్మిషన్ తీసుకునే సమయంలో విద్యార్థి మార్కులను 2.5 శాతం తక్కువగా లెక్కగట్టారు. దీంతో అతనికి అడ్మిషన్ దక్కకుండా పోయింది. దీంతో సంబంధిత విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ నరులా మాట్లాడుతూ.. ఉన్నత విద్యలను అభ్యసించే ముందే విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయడం చాలా అవసరమన్నారు. నిపుణులతో సంప్రదించి పాఠశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ (Career Guidance) అందించే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
* పిటిషనర్ వాదననలు అంగీకరించని న్యాయమూర్తి
ఈ విషయంలో పిటిషనర్ కోరిన రిలీఫ్‌లను మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. అయితే వివిధ విశ్వవిద్యాలయాల ప్రవేశ విధానాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడింది. దాన్ని బట్టి వారు సరైన సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కోర్టు తన ఉత్తర్వులలో కెరీర్ గైడెన్స్ కీలకమైన విషయం అని ప్రస్తావించింది. 11, 12వ తరగతి విద్యార్థులకు సహాయం చేయడానికి పాఠశాలల్లో తగిన కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లు, కెరీర్ ఫెయిర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్ తన పాఠశాలకు CBSE అఫ్లియేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పిటిషనర్ సవాల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కెరీర్ కౌన్సిలింగ్ విషయంలో పాఠశాలలకు సరైన మార్గదర్శకాలు, చట్టాలు ఏమీ లేవని తెలిపింది. దీంతో పాఠశాల విధానంపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ వాదనలో పాఠశాలదే తప్పు అనడానికి సరైన ఆధారాలు ఏమీ లేవని చెప్పింది. విద్యార్థి ఎంపికను పూర్తిగా వద్దు అని చెప్పడానికి పాఠశాలకు కూడా హక్కు ఉండదని చెప్పింది. దీంతో విద్యాశాఖకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Telangana Jobs: తెలంగాణలో మరో 3,897 ఉద్యోగాల భర్తీకి అనుమతులు.. ఏ శాఖలో అంటే?
* లోటును తొలగించాల్సిందే
ఈ విషయాలను ప్రస్తావిస్తూ వీటిపై సరైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. GNCTD (ఢిల్లీ ప్రభుత్వం), DoE(విద్యా విభాగం)కి ఈ వివరాలతో కూడిన ఆదేశాలను పంపించింది. ఈ లోటును పూరించాల్సిన అవసరం ఉందని, పాఠశాలలకు తగిన ఆదేశాలను జారీ చేయడం ద్వారా కౌన్సిలింగ్ వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi High Court, Intermediate