హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Inspires Aspirants: ప్రతిభకు మార్కులు కొలమానం కాదు.. ఈ ఐఏఎస్ అధికారే ప్రత్యక్ష సాక్ష్యం.. టెన్త్‌లో ఈయనకు ఎన్ని మార్కులో తెలుసా..?

Inspires Aspirants: ప్రతిభకు మార్కులు కొలమానం కాదు.. ఈ ఐఏఎస్ అధికారే ప్రత్యక్ష సాక్ష్యం.. టెన్త్‌లో ఈయనకు ఎన్ని మార్కులో తెలుసా..?

ఐఏఎస్ అవనీష్ శర్మ

ఐఏఎస్ అవనీష్ శర్మ

విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు.. జీవితానికి, తెలివికి మార్కులు కొలమానం కాదని తెలిపేందుకు ఐఏఎస్‌ అధికారి ట్విట్టర్‌లో తన పదో తరగతి మార్క్‌లిస్ట్‌ను పోస్ట్‌ చేశారు. ఆయనే 2009-బ్యాచ్ IAS అధికారి అవనీష్ శరణ్(IAS officer Awanish Sharan).

ఇంకా చదవండి ...

దేశంలోని ఆయా రాష్ట్రాల బోర్డులు వరుసగా 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాల(Exam Result)ను విడుదల చేస్తున్నాయి. త్వరలోనే సీబీఎస్‌ఈ(CBSE) 10, 12వ తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఫలితాలు విడుదలవుతున్న సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. పాస్‌ అవుతామా? లేదా? అని కొందరు.. అనుకొన్న విధంగా మార్కులు వస్తాయా? అని కొందరు ఆందోళన పడుతుంటారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత.. ఉత్తీర్ణత సాధించలేని కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేదన్న కారణంగానూ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు.

10, 12వ తరగతి విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు.. జీవితానికి, తెలివికి మార్కులు కొలమానం కాదని తెలిపేందుకు, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఓ ఐఏఎస్‌ అధికారి ప్రయత్నించారు. ట్విట్టర్‌లో తన పదో తరగతి మార్క్‌లిస్ట్‌ను పోస్ట్‌ చేశారు. ఆయనే 2009-బ్యాచ్ IAS అధికారి అవనీష్ శరణ్(IAS officer Awanish Sharan). ఛత్తీస్‌గఢ్ సివిల్ సర్వీసెస్ కేడర్‌కు చెందిన శరణ్ UPSCలో 700కి 314 మార్కులను సాధించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి ఆనంద్ శర్మ! -జేపీ నడ్డాతో భేటీ..


బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్(BSEB) నుంచి థర్డ్‌ డివిజన్‌లో శరణ్ పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఒక వ్యక్తి విజయాన్ని మార్కులు నిర్ధారించలేవని తెలియజేసేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన మార్క్‌షీట్‌లో గణితంలో 100 మార్కులకు మొత్తం 31 మార్కులు వచ్చినట్లు ఉంది. జాగ్రఫీలో 50కి 19 మార్కులు సాధించి అతికష్టం మీద ఆయన ఉత్తీర్ణత సాధించారు. జాగ్రఫీలో ఉత్తీర్ణత సాధించాలంటే 15 మార్కులు అవసరం. ఇతర సబ్జెక్టుల్లోనూ ఆయనకు ఎక్కువ మార్కులు రాలేదు.

ఐఏఎస్ అధికారి శరణ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మార్క్‌లిస్ట్‌ వైరల్‌ అయింది. ఆయన షేర్ చేసినప్పటి నుంచి పోస్ట్‌ను దాదాపు 23,000 మంది లైక్‌ చేశారు. నెటిజన్ల నుంచి రీట్వీట్‌లు, కామెంట్‌లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఆయన పోస్ట్‌ కింద ఓ ట్విట్టర్‌ యూజర్‌.. ‘మార్కులు ముఖ్యం కాదు. కలలు ముఖ్యమైనవి’ అని రాశారు. ‘పరీక్ష వార్షిక ఫలితం మాత్రమే మీ విధిని నిర్ణయించవు(Only An Annual Result Can’t Decide Your Destiny)’ అని మరొకరు రాశారు. మరొకరు పోస్ట్‌ని ట్యాగ్‌ చేస్తూ ‘స్ఫూర్తిదాయకం’ అని రాశారు. శరణ్‌ ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని, ఆదర్శప్రాయమని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశారు.

ఈ సంవత్సరం బీహార్ బోర్డు 10వ తరగతి పరీక్షకు మొత్తం 16,48,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీని ఫలితాలు మార్చి చివరిలో విడుదల అయ్యాయి. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ, 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. మొత్తం 5,03,570 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, మొత్తం 4,53,201 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ 10, 12వ తరగతుల బోర్డు ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ బోర్డ్ జులై 15 నాటికి ఫలితాలను ప్రకటించాలని యోచిస్తోంది.

Published by:Mahesh
First published:

Tags: Bihar, Twitter

ఉత్తమ కథలు