• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COSTLY VEGETABLES CALLED HOP SHOOTS CULTIVATED IN BIHAR OF INDIA AK GH

Hop shoots cultivation: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయలు.. మన దేశంలోనే.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Hop shoots cultivation: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయలు.. మన దేశంలోనే.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Gums Bleading: ఈ రోజుల్లో డాక్టర్ల దగ్గరకు వెళ్తున్న పేషెంట్లలో డాక్టర్లు కనిపెడుతున్నదేంటంటే... చాలా మంది కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వంటివి సరిపడా తినట్లేదు. మీరు సరిపడా కూరగాయలు తినకపోతే... మీ దంతాల చికుళ్ల నుంచి రక్తం కారడం మొదలవుతుంది. కారణం... మీ బాడీలో సరిపడా C విటమిన్ లేకపోవడం వల్లే. కూరగాయలు, పుల్లటి పండ్లు తింటే... C విటమిన్ లభిస్తుంది.

Hop shoots cultivation: ప్రస్తుతం వీటిని బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల అమ్రేశ్ సింగ్ అనే రైతు పండిస్తున్నాడు. ట్రయల్ బేసిస్‌లో వీటి సాగును ప్రారంభించినట్లు ఆయన చెబుతున్నారు.

  • Share this:
ప్రపంచంలోనే అత్యంత విలువైన పంటను సాగుచేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు బిహార్‌కు చెందిన ఒక రైతు. అతడు పండించే ప్రత్యేకమైన కూరగాయల ధర పదులు, వందల్లో కాదు.. ఏకంగా వేలల్లోనే ఉంటుంది. ఒక కిలో రూ.85000 వరకు ధర ఉండే ‘హాప్ షూట్స్’ అనే ఈ కూరగాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటిని బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల అమ్రేశ్ సింగ్ అనే రైతు పండిస్తున్నాడు. ట్రయల్ బేసిస్‌లో వీటి సాగును ప్రారంభించినట్లు ఆయన చెబుతున్నారు. జిల్లాలోని కరందిహ్ గ్రామానికి చెందిన అమ్రేశ్.. ఇతర ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలను కూడా సాగు చేస్తున్నాడు. మన దేశంలో హాప్ షూట్స్ పంటను అరుదుగా సాగు చేస్తారు. వీటిని ప్రత్యేక ఆర్డర్లతోనే కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం వీటి సాగు విజయవంతంగా కొనసాగుతోందని అమ్రేశ్ తెలిపారు. దీన్ని సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తే, రైతులకు ఇతర పంటలకంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన వివరిస్తున్నారు.

హాప్‌ షూట్స్ పూర్తిపేరు హ్యుములస్ లుపులస్. అంతర్జాతీయ మార్కెట్లలో దీని ధర కిలోకు 1000 యూరోల వరకు, మన కరెన్సీలో రూ.85,000 వరకు ఉంటుంది. ఈ పంటను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పండిస్తున్నారు. ఈ సంస్థ నుంచి అమ్రేశ్ రెండు నెలల క్రితం హాప్ షూట్స్ కూరగాయల నాట్లు తీసుకొచ్చి సాగు చేశారు. బిహార్ వంటి పేద రాష్ట్రాల్లో ఇలాంటి కొత్త పంటల సాగుతో వ్యవసాయ రంగం ఎంతగానో అభివృద్ధి చెందే అవకాం ఉందని అమ్రేశ్ తెలిపారు.

అన్ని భాగాలూ విలువైనవే
ఈ మొక్కలోని అన్ని భాగాలూ విలువైనవే కావడం విశేషం. దీని పూలు, పండ్లు, కాండాలను పానీయాలు, బీర్లు, మెడిసిన్ తయారీలో వాడతారు. ఈ మొక్క కాండంతో చేసే మందులకు క్షయ వ్యాధిని నివారించే శక్తి ఉంటుందని పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ చెట్టు పూలను బీరు తయారీలో స్టెబిలిటీ ఏజెంట్‌గా వాడతారు. మొక్కల కొమ్మలను ఆహార పదార్థాలు, మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారు. యూరోపియన్ దేశాల్లో దీన్ని చర్మ సంరక్షణకు వాడతారు. వీటిల్లో ఉండే యాంటీబయాటిక్స్ వయసుతో పాటు వచ్చే వృద్ధాప్యం ప్రభావాన్ని తగ్గిస్తాయని నమ్ముతారు.

సమస్యలకు నివారిణిగా..
హాప్ షూట్‌ను 11వ శతాబ్దంలో కనుగొన్నారు. అప్పట్లో బీరు ప్లేవర్ కోసం దీన్ని వాడారు. తరువాత ఇతర అవసరాల కోసం వాడటం మొదలుపెట్టారు. ఈ మొక్కల్లో ఉండే హ్యూములోన్స్, లుపులోన్స్ అనే యాసిడ్లు శరీరంలో క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు ఆందోళన, వికారం, నిద్రలేమి వంటి సమస్యలకు నివారిణిగా ఉపయోగపడుతుంది. బ్రిటన్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాల్లో హాప్ షూట్స్‌ను సాగు చేస్తుంటారు. ఇంతకు ముందు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఈ పంటలు వేశారు. కానీ మార్కెటింగ్ లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం వల్ల సాగును ఆపేశారు. హాప్ షూట్స్ సాగు విజయవంతం అవుతుందని అమ్రేశ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు