మహారాష్ట్రలో 20వేలకు చేరువలో కరోనా కేసులు..

మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 19063కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3470 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 731 మంది మరణించారు.

news18-telugu
Updated: May 8, 2020, 9:50 PM IST
మహారాష్ట్రలో 20వేలకు చేరువలో కరోనా కేసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20 వేలకు చేరువవుతోంది. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1089 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 37 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 19063కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3470 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 731 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 14,862 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

అటు మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబై నుంచే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 748 కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. మరో 25 మరణాలు నమోదయినట్లు వెల్లడించారు. తాజా లెక్కలతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
11,967కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 2589 మది కోలుకోగా.. 462 మంది చనిపోయారు.
First published: May 8, 2020, 9:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading