హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UK Virus: ఇండియాలో జోరుగా కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు. మొత్తం ఎన్నంటే...

UK Virus: ఇండియాలో జోరుగా కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు. మొత్తం ఎన్నంటే...

ఇండియాలో జోరుగా కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు. (image credit - NIAID)

ఇండియాలో జోరుగా కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు. (image credit - NIAID)

Coronavirus updates: ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో కొత్త కరోనా రాకూడదని కేంద్రం గట్టిగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఇండియాలో ఈ కేసులు పెరిగిపోతున్నాయి.

  UK Virus: కొత్త రూపాంతర కరోనా వైరస్ (mutated covid 19) బ్రిటన్‌లోనే కాదు... ఇండియాలోనూ కొత్త భయాలు కలిగిస్తోంది. మామూలు కరోనా వైరస్ కంటే 70 శాతం ఎక్కువ వేగంతో వ్యాపించే ఈ కొత్త కరోనా వైరస్ వల్ల బ్రిటన్‌లో రోజువారీ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా 68,053 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అమెరికా తర్వాత డైలీ ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశంగా బ్రిటన్ నిలిచింది. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నిన్న అక్కడ 1325 మంది చనిపోయారు. మరణాల్లోనూ అమెరికా తర్వాత రెండో స్థానంలో బ్రిటనే ఉంది. ఇలా అక్కడ కొత్త రూపాంతర వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దాని కాటుకు రోజూ వేల మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే అన్ని ఆస్పత్రులూ పేషెంట్లతో నిండిపోయాయి.

  ఇండియాలో విజృంభణ:

  తెలుగు రాష్ట్రాలు సహా ఇండియాలోకి బ్రిటన్ నుంచి వచ్చిన వారి ద్వారా... మొదట ఆరు కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత 19కి చేరాయి. అలా అవి పెరుగుతూ ఇప్పుడు 90కి చేరాయి. కొత్త కరోనా వచ్చినా ఇండియాలో ఏం కాదులే అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే... ఆల్రెడీ పాత కరోనాను ఎదుర్కొనే శక్తి, ఇమ్యూనిటీ భారతీయుల్లో వచ్చేసిందనీ... అందువల్లే... కొత్త కరోనా వల్ల ఏం కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

  ఈ వైరస్‌ వ్యాప్తిని నిరంతరం పరిశీలిస్తున్న వారు ఓ షాకింగ్ విషయం చెప్పారు. భారతీయుల్లో నిజానికి ఇమ్యూనిటీ పవర్ పెరగలేదనీ... వైరస్సే దానంతట అది నెమ్మదించిందని అంటున్నారు. ఇలా నెమ్మదించిన వైరస్ కొన్నాళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తోందనీ... ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇలా జరుగుతోందని చెబుతున్నారు. అందువల్ల ఇండియాలో కూడా తిరిగి వైరస్ పుంజుకునే రోజు రావచ్చని అంటున్నారు. ఈ లోగా వ్యాక్సిన్ల పంపిణీ, టీకా వేసే కార్యక్రమాలు జోరందుకోవాలని సూచిస్తున్నారు.

  30 దేశాల్లో కొత్త కరోనా:

  ఈ కొత్త కరోనా వైరస్ తాజాగా వియత్నాంలో కూడా బయటపడింది. ఇప్పటికే ఇది 30కి పైగా దేశాల్లో వ్యాపించింది. అమెరికా (America)లో 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఇప్పటికే అమెరికాలో రోజూ 3 లక్షలకు పైగా కేసులు, 4వేల దాకా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ కొత్త కరోనా అక్కడ వేగంగా వ్యాపిస్తే... కేసులు, మరణాలు ఏ స్థాయికి చేరతాయో చెప్పలేం.

  ఇది కూడా చదవండి: Astrology: ఏ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి... త్వరగా డబ్బు రావాలంటే ఇలా చెయ్యాలి

  అప్రమత్తతే రక్ష:

  ఇప్పుడు ఉన్న కరోనా వ్యాక్సిన్లు కొత్త వైరస్‌ను ఎదుర్కోగలవా, లేదా అన్నది ఇంకా తేలలేదు. కాబట్టి... వ్యాక్సిన్లపై నమ్మకం పెట్టుకోకుండా... ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అంటే మంచి మందపాటి మాస్క్ ధరించడం, నాణ్యమైన హ్యండ్ శానిటైజర్ వాడటం, వీలైనంతవరకూ సేఫ్ డిస్టా్స్ పాటించడం అవసరమే. కొత్త వైరల్ వల్ల బ్రిటన్‌లో మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. అందువల్ల ఈ స్ట్రెయిన్ మనల్ని ఏమీ చెయ్యలేదులే అనుకోవడం సమంజసం కాదంటున్నారు నిపుణులు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: UK Virus

  ఉత్తమ కథలు