HOME »NEWS »NATIONAL »coronavirus updates oxford astrazeneca vaccine may gets approve from indian government by next week nk

Covid vaccine: ఇండియాలో ఆ వ్యాక్సిన్‌కి వచ్చే వారం అనుమతులు? కరోనాకి చెక్...

Covid vaccine: ఇండియాలో ఆ వ్యాక్సిన్‌కి వచ్చే వారం అనుమతులు? కరోనాకి చెక్...
ఇండియాలో ఆ వ్యాక్సిన్‌కి వచ్చే వారం అనుమతులు? కరోనాకి చెక్... (image credit - twitter - reuters)

Covid Vaccine in India: ఇండియాలో కరోనా కేసులు కోటి దాటేశాయి. వెంటనే మనకు వ్యాక్సిన్ కావాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం ఆ కీలకమైన వ్యాక్సిన్‌కి అనుమతులు ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

  • Share this:
    Oxford vaccine: బ్రిటన్, అమెరికా, రష్యాలో కరోనాకి వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. మరి మన దేశంలో ఎప్పుడు అనుమతులు ఇస్తారు అని అంతా ఎదురుచూస్తున్నారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే... ఆక్స్‌ఫర్డ్-ఆస్త్రాజెనెకా కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్‌కి కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ వాడకానికి వచ్చే వారం అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ వ్యాక్సిన్‌ని ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ ఇండియా... అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దీన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని... రెండు వర్గాల నుంచి తమకు నమ్మదగిన సమాచారం వచ్చిందని రాయిటర్స్ తెలిపింది. ఈ అనుమతి ఇస్తే గనక... బ్రిటన్‌లో తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా ఇండియా మారనుంది. మరోవైపు ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్ డ్రగ్ రెగ్యులేటరీ అధికారులు కూడా మదటి నుంచి పరిశీలిస్తూనే ఉన్నారు.

    ప్రపంచంలో వ్యాక్సిన్ల తయారీలో పెద్ద దేశం ఇండియానే. చాలా కంపెనీల వ్యాక్సిన్లు ఇండియాలోనే తయారవుతాయి. అలాంటిది ఇండియాలో వ్యాక్సిన్ వాడకం ముందుగా ప్రారంభం కాకపోవడం ప్రజలకు ఒకింత నిరాశ కలిగిస్తోంది. ఐతే... కేంద్ర ప్రభుత్వం వెంటనే దేనికీ అనుమతి ఇచ్చేయకుండా అన్నీ పరిశీలించాకే అనుమతి ఇవ్వాలనుకుంటోంది. ఆక్స్‌ఫర్డ్ లాగే... అమెరికా కంపెనీ ఫైజర్ (Pfizer), భారత కంపెనీ భారత్ బయోటెక్ కూడా తమ వ్యక్సిన్ల ఎమర్జెన్సీ వాడకానికి అప్లికేషన్లు పెట్టుకున్నాయి. కేంద్రం ఇంకా దేనికీ అనుమతి ఇవ్వలేదు.



    వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తే... ఒక్కసారిగా 30 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చెయ్యాలని కేంద్రం ప్లాన్ వేసుకుంది. ఆ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు ఆల్రెడీ జరిగాయి. ఫైజర్ వ్యాక్సిన్ చాలా రేటు ఎక్కువ. పైగా ఇండియాలో దాన్ని మైనస్ 70 డిగ్రీల్లో ఉంచడం కష్టమైన పని. అదే... ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అయితే... చాలా తక్కువ రేటుకే (రూ.250) లభించే ఛాన్స్ ఉంది. పైగా దాన్ని అంత ఎక్కువ కూలింగ్‌లో ఉంచాల్సిన పనిలేదు. ఇళ్లలోని ఫ్రిజ్‌లలో కూడా ఉంచవచ్చు. అందువల్ల దానికే అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది.

    డిసెంబర్ 9న తొలిసారి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO)... మూడు అప్లికేషన్లనూ పరిశీలించి, మరికొంత సమాచారం కావాలని కోరింది. అందుకుతగ్గట్టుగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)... ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సమాచారం పూర్తిగా ఇచ్చినట్లు తెలిసింది. అందువల్ల ఆ వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే... సీరం వెంటనే భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేపట్టగలదు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. రెండు డోసులూ కలిపి... 70 శాతం ప్రభావవంతంగా పనిచేయగలదని తేల్చారు. 60 శాతం కంటే ప్రభావ వంతంగా ఉండే వ్యాక్సిన్లు వైరస్‌ను చంపగలవు. పైగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా సరైనదిగా నమ్ముతోంది. అందువల్ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోసం ఇండియాతోపాటూ... ప్రపంచ దేశాలూ ఎదురుచూస్తున్నాయి.

    ఇది కూడా చదవండి:Romantic Zodiac signs: ఈ రాశుల వారు మోస్ట్ రొమాంటిక్... ఈ లిస్టులో మీరు ఉన్నారా?

    ఇండియా ఇప్పటివరకూ వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఏ కంపెనీతోనూ డీల్ కుదుర్చుకోలేదు. సీరం మాత్రం ఇప్పటికే 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ రెడీగా ఉత్పత్తి చేసి పెట్టుకుంది. జులై నాటికి 40 కోట్ల డోసులు రెడీ చేయ్యాలనుకుంటోంది.
    Published by:Krishna Kumar N
    First published:December 23, 2020, 09:37 IST

    टॉप स्टोरीज