India Coronavirus : ఇండియాలో నిన్న (మంగళవారం).. కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కి పెరిగింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా ఏడుగురు చనిపోవడంతో... మొత్తం దేశవ్యాప్త కరోనా మరణాల సంఖ్య 5,30,848కి చేరింది. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు చనిపోగా... కర్ణాటకలో ఒకరు, కేరళలో ముగ్గురు చనిపోయారు.
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది. అలాగే వారపు పాజిటివిటీ రేటు 1.53 శాతంగా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు (4,47,09,676) చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతంగా ఉంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెబ్‌సైట్ తెలిపింది.
రాష్ట్రాలు అప్రమత్తం :
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంపై.. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. టెస్ట్, ట్రీట్, ట్రేస్ విధానాన్ని పక్కాగా అమలు చెయ్యాలని కేంద్రం కోరింది. ఏప్రిల్ 10న దేశవ్యాప్తంగా కరోనా ప్రిపరేషన్‌పై మాక్ డ్రిల్ జరపనుంది. ఇందులో డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొని.. కరోనాపై సన్నద్ధం అవుతారు. అలాగే ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసుకోవాలని కేంద్రం కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.