• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CORONAVIRUS UPDATES 43183 NEW CASES AND 249 DEATHS REPORTED IN MAHARASHTRA BMC LIKELY TO LOCKDOWN RESTRICTIONS SK

మహారాష్ట్రలో ఒక్కరోజే 43వేలకు పైగా కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఛాన్స్

మహారాష్ట్రలో ఒక్కరోజే 43వేలకు పైగా కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

రోజు విడిచి రోజు దుకాణాలను తెరవడం, కేవలం అత్యవసర సేవల కోసం మాత్రమే లోకల్ రైల్వేను ఉపయోగించడం, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేయడం.. వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

  • Share this:
    మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం రేపుతోంది. కొత్త కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ను ప్రజలు లెక్క చేయడం లేదు. మాస్క్‌లు లేకుండానే గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఈ కారణగానే రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. గురువారం ఒక్కరోజే 43,183 కొత్త కేసులు నమోదయ్యాయి. 32,641 మంది కరోనా నుంచి కోలుకోగా.. 249 మంది మరణించారు. నిన్న ఒక్క ముంబై నగరంలోనే 8,646 కేసులు వచ్చాయంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,56,163కి చేరింది. వీరిలో 24,33,368 మంది కోలుకోగా.. 54,898 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 3,66,533 యాక్టివ్ కేసులున్నాయి.

    రోజు రోజుకూ పెరుగుతున్న కేసులతో మహారాష్ట్ర ప్రభుత్వం తలలు పట్టుకుంది. ప్రజలు మాట వినకుంటే లాక్‌డౌన్ విధిస్తామని సీఎం హెచ్చరించినా మార్పు రావడం లేదు. ఈ క్రమంలో లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా లాక్‌డౌన్ విధించాలని భావిస్తోంది. రాష్ట్ర రాజధాని ముంబైలో కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త గైడ్ లైన్స్ రూపొందించాల్సిందిగా అధికారులను సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశించారు. రోజు విడిచి రోజు దుకాణాలను తెరవడం, కేవలం అత్యవసర సేవల కోసం మాత్రమే లోకల్ రైల్వేను ఉపయోగించడం, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేయడం.. వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.


    మహారాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. పుణెలో ప్రస్తుతం 64,599 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక ముంబైలో 54,807, థానెలో 42,151, నాసిక్‌లో 36,292, నాగ్‌పూర్‌లో 48,806, ఔరంగాబాద్‌లో 13,482 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాజధాని ముంబై మాత్రమే కాదు.. ఇతర నగరాల్లోనూ పెద్ద మొత్తంలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలను సిద్ధమవుతోంది మహారాష్ట్ర సర్కార్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు