తమిళనాడులో 17వేలు దాటిన కరోనా కేసులు

news18-telugu
Updated: May 25, 2020, 8:06 PM IST
తమిళనాడులో 17వేలు దాటిన కరోనా కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ కోవిడ్-19 బాధితుల సంఖ్య 17వేలు దాటింది. సోమవారం తమిళనాడు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఇవాళ మరో 805 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఏడుగురు చనిపోయారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 17,082కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 8,731 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 118 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 8,230 యాక్టివ్ కేసులున్నాయి. అటు చెన్నైలో సోమవారం 407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 6,977 కొత్త కేసులు నమోదవగా.. 154 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 1,38,845 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 57,721 మంది కోలుకోగా.. 4,021 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 77,103 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 25, 2020, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading