ముంబై ధారవి మురికివాడలో తొలి కరోనా కేసు.. ఆస్పత్రిలో పేషెంట్ మృతి

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అక్కడ 320 పాజిటివ్ కేసులు నమోదవగా.. 39 మంది కోలుకున్నారు. 12 మంది చనిపోయారు.

news18-telugu
Updated: April 1, 2020, 10:56 PM IST
ముంబై ధారవి మురికివాడలో తొలి కరోనా కేసు.. ఆస్పత్రిలో పేషెంట్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రపై కోవిడ్-19 మహమ్మారి పంజా విసురుతోంది. ముంబై సహా ఇతర జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ అయిన ధారవిలో తొలి కరోనా కేసు నమోదయింది. షాహునగర్ ప్రాంతంలో 56 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. హుటాహటిన అతడిని సియాన్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. మరణించే ముందు తీవ్ర దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడినట్లు డాక్టర్లు తెలిపారు. ఇంతకు ముందే అతడికి కిడ్నీ సంబంధ వ్యాధి ఉన్నట్లు వెల్లడించారు.


ఈ ఘటనతో అప్రమత్తమైన బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. పోలీసులు కూడా చేరుకొని స్థానికులకు కీలక సూచనలు చేశారు. మురికివాడ ప్రాంతం కావడం, జనసాంద్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న దానినై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మృతుడి కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అక్కడ 320 పాజిటివ్ కేసులు నమోదవగా.. 39 మంది కోలుకున్నారు. 12 మంది చనిపోయారు. ప్రస్తుతం 269 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక ఒక్క ముంబైలోనే 127 కేసులు నమోదవడం గమనార్హం.

First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading