మాస్క్ లేకుంటే పెట్రోల్ పోయరు.. కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం

ప్రతీకాత్మకచిత్రం

పెట్రోల్ బంకుల్లో మాస్క్‌ని తప్పనిసరి చేశాయి. వాహనదారులు మాస్క్ ధరించకుంటే వారికి పెట్రోలో, డీజిల్, గ్యాస్ నింపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి.

  • Share this:
    మన దేశంలో ఇప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారంతా మాస్క్ ధరించాలి. ప్రధాని మోదీతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ చాలా మంది మాస్క్ పెట్టుకోవడం లేదు. కొందరు వ్యాధి తీవ్రత తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాకేమవుతుందిలే.. అని లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని పెట్రోల్ పంప్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకుల్లో మాస్క్‌ని తప్పనిసరి చేశాయి. వాహనదారులు మాస్క్ ధరించకుంటే వారికి పెట్రోలో, డీజిల్, గ్యాస్ నింపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. మాస్క్ ధరించకపోవడం వల్ల వారితో పాటు పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందికి కూడా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదముందని.. ఈ క్రమంలోనే 'నో మాస్క్-నో పెట్రోల్' నిబంధన తీసుకొచ్చామని తెలిపాయి.

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ అత్యవసర సేవలకు మినహాయింపు ఉంది. నిత్యావసర సరుకులను చేరేవేసే వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అంతేకాదు కూరగాయలు, ఇతర నిత్యావసర కోసం ఇంటికి 3 కి.మీ. పరిధిలోకి జనాలు వెళ్లవచ్చు. ఐతే బైక్‌పై ఒకరు, కార్లలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాలు పరిమిత సంఖ్యలో తిరుగుతున్నాయి. అలాంటి వాటికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యంతో పెట్రోల్ బంక్‌లు కూడా తెరిచే ఉన్నాయి. ఐతే లాక్‌డౌన్‌ను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో.. పెట్రోల్ బంక్‌ల అసోసియేషన్ కూడా మాస్క్‌ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: