CORONAVIRUS NEWS PM NARENDRA MODI GETS SECOND COVID 19 DOSE IN DELHI AIIMS HE SAYS VACCINATION AMONG FEW WAYS TO DEFEAT VIRUS SK
PM Narendra Modi: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Corona Vaccination: కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్ కూడా ఒకటని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని..అందుకోసం కోవిన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్‌కి చెందిన నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ షాట్ వేశారు. ఆమెతో పాటు పుదుచ్చేరికి చెందిన పి. నివేదా సాయం చేశారు. తాను రెండో డోస్ తీసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్ కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని..అందుకోసం కోవిన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
Vaccination is among the few ways we have, to defeat the virus.
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న మొదటి డోస్ తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజే ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేద టీకా వేశారు. ఆమెకు కేరళ చెందిన మరో నర్సు రోసమ్మ అనిల్ సాయం చేశారు. రెండో డోస్ సమయంలోనూ నివేద అక్కడే ఉన్నారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారు.
మార్చి 1న కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న ప్రధాని మోదీ
ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరో వైపు కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో అల్లకల్లోలం చేస్తోంది. రోజుకు లక్ష కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సగానికంటే ఎక్కువ కేసులు మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల్లో 56.1శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలను కరోనా ఆంక్షను మళ్లీ కఠినతరం చేస్తున్నాయి. మహారాష్ట్రలో శని, ఆదివారాల్లో లాక్డౌన్ పాటిస్తున్నారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. అటు మధ్యప్రదేశ్‌లోనూ ఆదివారం లాక్డౌన్ విధిస్తున్నారు. చాలా రాష్ట్రాలు రాత్రివేళ కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కరోనా ఉద్ధృతి పెరిగిందని.. ప్రజలంతా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.