HOME »NEWS »NATIONAL »coronavirus india extends uk flight ban till january 7 sk

UK flights Ban: యూకే విమానాలపై నిషేధం పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

UK flights Ban: యూకే విమానాలపై నిషేధం పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ప్రతీకాత్మక చిత్రం

UK virus: మన దేశంలో ఇప్పటి వరకు 20 మందిలో కరోనా వైరస్ మ్యుటేటెడ్ వేరియంట్ గుర్తించారు. కొత్తరకం వేరియెంట్ కరోనా వైరస్ ఎన్సీడీసీ ఢిల్లీలో ఎనిమిది మంది, ఎన్ఐబీజీ కల్యాణి 1, ఎన్ఐవీ పుణె 1, నింఫాన్స్‌లో 7, సీసీఎంబీలో 2, ఐజీఐబీలో 1 వెలుగు చూశాయి.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా యూకే వైరస్ అలజడి రేపుతోంది. యూకే నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. కొత్త స్ట్రెయిన్ విజృంభనతో అప్రమత్తమైన ఇతర దేశాలు.. విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. భారత్ కూడా యూకే నుంచి విమానాల రాకపోకలను ఇప్పటికే నిలిపివేసింది. ఐతే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగిస్తూ విదేశాంగశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ట్విటర్‌లో హర్దీప్ సింగ్ పురి ప్రకటన చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.




    న్యూ ఇయర్ వేడులకు పెద్ద ఎత్తున జనాలు పోగయ్యే అవకాశముంది. ఇలాంటి పార్టీల వల్ల కోవిడ్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదముంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ పార్టీలపై ఓ కన్నేసి ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్‌ను ఎక్కడికక్కడ నియంత్రించాలని స్పష్టం చేసింది. జనవరి 30, 31తో పాటు జనవరి 15న ఆంక్షలు విధించే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. శీతాకాలంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని.. ప్రజలంతా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటించాలని వెల్లడించింది.

    మనదేశంలో ఇప్పటి వరకు 20 మందిలో కరోనా వైరస్ మ్యుటేటెడ్ వేరియంట్ గుర్తించారు. కొత్తరకం వేరియెంట్ కరోనా వైరస్ ఎన్సీడీసీ ఢిల్లీలో ఎనిమిది మంది, ఎన్ఐబీజీ కల్యాణి 1, ఎన్ఐవీ పుణె 1, నింఫాన్స్‌లో 7, సీసీఎంబీలో 2, ఐజీఐబీలో 1 వెలుగు చూశాయి. కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో యూకే విమానాలపై భారత ప్రభుత్వం ఇది వరకే ఆంక్షలు విధించింది. విమాన రాకపోకలను నిలిపివేశారు. తాజాగా ఆ నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త వైరస్ నేపథ్యంలో భారత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:December 30, 2020, 11:59 IST