• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CORONAVIRUS HOMEOPATHY VACCINE NOSODE WORKS 61 PERCENT ON COVID 19 PATIENTS SAYS DOCTOR RAJESH SHAH OF MUMBAI NK

Homeo Vaccine: కరోనాకు హోమియో వ్యాక్సిన్... ఎంత ప్రభావం చూపిస్తోంది?

Homeo Vaccine: కరోనాకు హోమియో వ్యాక్సిన్... ఎంత ప్రభావం చూపిస్తోంది?

కరోనాకు హోమియో వ్యాక్సిన్...(ప్రతీకాత్మక చిత్రం)

Homeopathy Vaccine: ఇప్పటికే కరోనాకి రకరకాల వ్యాక్సిన్లు వచ్చాయి. తాజాగా హోమియోపతి వ్యాక్సిన్ వచ్చింది. అది ఎలా పనిచేస్తోందో తెలుసుకుందాం.

  • Share this:
    Homeopathy Vaccine: ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు హోమియోపతి వ్యాక్సిన్ తయారైంది. దాని పేరు నొసోడ్ (Nosode). త్వరలో ఇది అందుబాటులోకి రాబోతోంది. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తోంది అనేదాన్ని పరిశీలించారు. కరోనా పేషెంట్లపై ఇది 62 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేల్చారు. సాధారణంగా 60 శాతం ప్రభావంతో పనిచేసే వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమర్థిస్తోంది. ఆ రకంగా చూస్తే ఈ వ్యాక్సిన్‌కి అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే... దీన్ని ఇచ్చిన వారిలో కరోనా లక్షణాలు తగ్గడమే కాదు... శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతోంది. కాస్త కోలుకున్నట్లు పేషెంట్లకు అనిపించేలా చేయగలుగుతోంది.

    అసలు హోమియోపతికి వ్యాక్సిన్ ఏంటి అనే డౌట్ రావట్టు. అమెరికా వ్యాధుల పరిశోధన, నియంత్రణ సంస్థ - CDC ప్రకారం... ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతోంది కాబట్టి... దీన్ని వ్యాక్సిన్‌గా గుర్తించవచ్చు అని నిపుణులు అంటున్నారు.

    అభివృద్ధి ఇలా:
    నొసోడ్‌ను ముంబైలోని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిరా చీఫ్, పరిశోధకుడు అయిన డాక్టర్ రాజేష్ షా తయారుచేశారు. దీనితో క్లినికల్ ట్రయల్స్ జరపగా... కరోనాకు బాగా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. డాక్టర్ రాజేష్ షా... 20 ఏళ్లుగా చాలా హోమియోపతి మందులు తయారుచేశారు. రెండు వ్యాక్సిన్లు చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.

    ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన రిపోర్టును కేంద్రానికి, భారత మందుల నియంత్రణ సంస్థ - DCGIకి సమర్పిస్తే... దీన్ని అనుమతించాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుతం కరోనా టీకాలకు చాలా డిమాండ్ ఉంది. తీవ్ర కొరత ఉంది. అందువల్ల అనుమతులు లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

    ఇది కూడా చదవండి: World of Virus: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్‌లు ఇవే... విజయం మనదే...

    India Corona: ఇండియాలో ప్రతి నిమిషానికి 150 కరోనా కొత్త కేసులు వస్తున్నాయి. అలాగే... ప్రతి 45 సెకండ్లకు కరోనాతో ఒకరు చనిపోతున్నారు. భారత్‌లో కొత్తగా 2,17,353 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. కొత్తగా 1,185 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,74,308కి చేరింది. తాజాగా 1,18,302 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,25,47,866కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 61,695 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఉత్తరప్రదేశ్‌లో 22,339, ఢిల్లీలో 16,699, ఛత్తీస్‌గఢ్‌లో 15,256, కర్నాటకలో 14,738, మధ్యప్రదేశ్‌లో 10,166, పశ్చిమ బెంగాల్ 6,769, రాజస్థాన్ 6,658 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,73,210 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటి వరకు 26 కోట్ల 34 లక్షల 76వేల 625 టెస్ట్‌లు చేశారు. ఇక 11 కోట్ల 72 లక్షల 23వేల 509 మందికి వ్యాక్సిన్ వేసుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు