ఇండియాలోకి కరోనా వైరస్..? వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాదీ

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో థెర్మల్ స్క్రీనింగ్ సెంటర్‌ పెట్టి.. చైనా, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.


Updated: January 24, 2020, 10:25 PM IST
ఇండియాలోకి కరోనా వైరస్..? వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాదీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రాణాంతక కోరానా వైరస్ చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకూ వ్యాప్తిస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక చైనా మన దేశానికి పక్కనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చైనా నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నారు. శుక్రవారం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌కు వచ్చిన 94 విమానాల్లోని దాదాపు 21 వేల మందికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఐతే ఏ ఒక్కరిలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు లేవని వెల్లడించారు. కానీ వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో 9 మందిని స్పెషల్ అబ్జర్వేషన్‌లో ఉంచారు. వారిలో ఏడుగురు కేరళ, ఇద్దరు ముంబై, ఒకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. ఇక కేరళలో 72 మందికి వారి ఇళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో థెర్మల్ స్క్రీనింగ్ సెంటర్‌ పెట్టి.. చైనా, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఎవరికైనా శ్వాసకోస ఇబ్బందులు ఉంటే వారి కోసం బెడ్స్ ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందించేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక కేరళ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఏడుగురు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలతో ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వారిలో తిరువనంతపురంలో ఇద్దరు, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్, పతానంతిట్టలో ఒక్కరు చొప్పున అబ్జర్వేషన్‌లో ఉంచారు. కాగా, కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు.
Published by: Shiva Kumar Addula
First published: January 24, 2020, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading