Omicron BF.7: కొవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BF.7 చైనాను కబళిస్తోంది. ప్రభుత్వమే చేతులెత్తేయడంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పుబోతుంది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తునన ఈ కొత్త వేరియెంట్ కేసులు ఇండియాలో కూడా నమోదయ్యాయి. మన దేశంలో గత ఆరు నెలల కాలంలో నాలుగు Omicron BF.7 స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. ఐతే చైనా తరహాలో ఈ వేరియంట్ ఇంకా ఎక్కువ మందికి వ్యాపించలేదు. ఐనప్పటికీ కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19కి సంబంధించిన 10 వేరియంట్‌లు ఉన్నాయని, వాటిలో కొత్తది BF.7 అని పేర్కొంది.
Corona Updates : కరోనా అలర్ట్‌లో ఇండియా.. BF.7పై వణుకుతున్న రాష్ట్రాలు
చైనాలో 60 శాతం మందికి వైరస్?
కొత్త కరోనా వేరియంట్ చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి తక్కువ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉందని తెలిపింది. రాబోయే మూడు నెలల్లో చైనాలో 60% మందికి ఈ వేరియంట్ సోకుతుందని అనుమానిస్తున్నారు. ఈ వైరస్ యూఎస్, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, బ్రెజిల్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. చైనాకు చెందిన ఎపిడిమాలజిస్ట్ ఎరిక్ డెంగి మాట్లాడుతూ.. ఈ వైరస్ రాబోయే కొద్ది నెలల్లో చైనా అంతటా మిలియన్ల మంది మరణాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు.
Covid Again : కథ మళ్లీ మొదటికి..విమానాశ్రయాల్లో మళ్లీ కరోనా టెస్ట్ లు ప్రారంభం!
BF.7 స్ట్రెయిన్ అంటే ఏంటి?
ఈ వేరియంట్ ఓమిక్రాన్ ఉత్పరివర్తనను కలిగి ఉంది. అన్ని కొవిడ్ వేరియంట్‌లలో అతి త్వరగా వ్యాపించే గుణం ఉంది. అధ్యయనాల ప్రకారం.. ఈ వేరియంట్ R0 విలువ సుమారుగా 10-18.6 ఉంటుంది. అంటే ఇది సోకిన వ్యక్తి నుంచి తన చుట్టూ ఉన్న 10- 18.6 మందికి సోకే అవకాశం ఉంది. టీకాలు వేయించుకోని వారు, వృద్ధులు, పిల్లలు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
Omicron BF.7 లక్షణాలు
ఈ వైరస్ బారిన పడినవారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. న్యుమోనియా అనేది వృద్ధులలో కనిసిస్తుంది.
Omicron BF.7: జాగ్రత్తలు
ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పక ధరించాలి. ముందు జాగ్రత్తగా అందరూ బూస్టర్ డోస్‌లు తీసుకోవాలి. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ V K పాల్ మాట్లాడుతూ.. భారతదేశంలోని అర్హత ఉన్న జనాభాలో 27-28% మంది ఇప్పటి వరకు వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకొన్నారని చెప్పారు. సెలవులు వస్తుండటంతో.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన పరిశుభ్రతను పాటించాలి. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ అనేది Omicron BF.7 వేరియంట్ ప్రమాదాన్ని తగ్గించడానికి మరొక మార్గం.
భారతదేశంలో కరోనా కేసులు
గురువారం భారతదేశంలో 185 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,402గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,42,432కు పెరిగింది. మరణాల రేటు 1.19%గా ఉంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఒకరు వైరస్‌తో మరణించారు. గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన మేరకు.. భారతదేశంలో ఇప్పటివరకు 5,30,681 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.03 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Coronavirus, Covid-19, Omicron BF.7