ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్... ఇప్పుడు దాణా కుంభకోణం కేసులో జైలు జీవితం గడుపుతున్నారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో రాంచీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణంగా లాలూకు చికిత్స అందించే డాక్టర్ ట్రీట్మెంట్ అందించిన మరో రోగికి కరోనా రావడమే. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ వైద్యం అందించిన ఓ రోగికి కరోనా వచ్చినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో డాక్టర్ ఉమేశ్ ప్రసాద్‌తో పాటు ఆయన టీమ్‌లోని మరికొందరిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Lalu Prasad Yadav