కేంద్రం, బెంగాల్ మధ్య ‘రెడ్ జోన్’ వివాదం

కేంద్రం, బెంగాల్ మధ్య రెడ్ జోన్ వివాదం తెరపైకి వచ్చింది.

news18-telugu
Updated: May 1, 2020, 3:32 PM IST
కేంద్రం, బెంగాల్ మధ్య ‘రెడ్ జోన్’ వివాదం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ సర్కార్‌కు మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా కేంద్రం, బెంగాల్ మధ్య రెడ్ జోన్ వివాదం తెరపైకి వచ్చింది. దేశంలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను జిల్లాలవారీగా విభజిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్రం. ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 23 జిల్లాలో రెడ్ జోన్ పరిధిలో 10 జిల్లాలు, ఆరెంజ్ జోన్ పరిధిలో 5, గ్రీన్ జోన్ పరిధిలో 8 జిల్లాలు ఉన్నట్టు పేర్కొంది. అయితే తమ రాష్ట్రంలో 10 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన జాబితాపై పశ్చిమ బెంగాల్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాక ప్రిన్సిపల్ సెక్రటరీ వివేక్ కుమార్ కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశారు.



తమ రాష్ట్రంలో మొత్తం 10 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్టుగా కేంద్రం పేర్కొనడాన్ని తప్పుబట్టిన పశ్చిమ బెంగాల్... రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ పరిధిలోకి వస్తాయని సూచించింది. రాష్ట్రంలోని కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగనాస్, పర్బా మెడినిపూర్ మాత్రమే రెడ్ జోన్ పరిధిలోకి వస్తాయని లేఖలో పేర్కొంది. దీనిపై సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది.
Published by: Kishore Akkaladevi
First published: May 1, 2020, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading