షాకింగ్ న్యూస్.. సీఎం భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్..

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు భద్రతా సిబ్బందికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.

news18-telugu
Updated: May 2, 2020, 1:10 PM IST
షాకింగ్ న్యూస్.. సీఎం భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్..
ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)
  • Share this:
మహారాష్ట్రలో మొదట్నుంచీ కరోనా వైరస్ తీవ్రత అధికంగానే ఉంది. ఇక్కడ సామాన్య ప్రజానీకంతో పాటు వైద్యులు, భద్రతా సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇదిలావుంటే.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు భద్రతా సిబ్బందికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటు కుటుంబ సభ్యలును సైతం క్వారంటైన్‌కు తరలించారు. ఇదిలావుంటే.. మరోవైపు బాంబే ఐఐటీలోనూ తొలి కరోనా కేసు నమోదయ్యింది. క్యాంపస్‌లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దక్షిణ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సదరు మహిళ పనిచేస్తోంది. దీంతో క్యాంపస్‌లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించి.. క్యాంపస్ మొత్తం శానిటైజ్ చేశారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఇప్పటివరకు 11,506 నమోదు కాగా, 485 మంది మృతి చెందారు. 1879 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
First published: May 2, 2020, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading