• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CORONA VACCINE RABIES VACCINE GIVEN TO THREE WOMEN INSTEAD OF COVID 19 JAB IN UTTAR PRADESH FULL DETAILS HERE NK

Corona vaccine: వ్యాక్సిన్ విషయంలో తేడా... ముగ్గురు మహిళలకు అనారోగ్య సమస్యలు

Corona vaccine: వ్యాక్సిన్ విషయంలో తేడా... ముగ్గురు మహిళలకు అనారోగ్య సమస్యలు

వ్యాక్సిన్ విషయంలో తేడా... ముగ్గురు మహిళలకు అనారోగ్య సమస్యలు (ప్రతీకాత్మక చిత్రం)

Corona vaccine: అసలే కరోనాకి వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఘటనలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి.

  • Share this:
    Corona vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే... రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోందే తప్ప... ఇండియాలో అంతలా ఎవరికీ తీవ్ర అనారోగ్యాలు రాలేదు. విదేశాల్లో ఎలా పనిచేసినా... ఇండియాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్లు బాగానేపనిచేస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ రెండు వ్యాక్సిన్లతో ఇండియాలో భారీ సైడ్ ఎఫెక్టులు ఎవరికీ రాలేదు. విదేశాల్లో కోవిషీల్డ్ వాడకంలో కొన్ని తేడాలు కనిపించడంతో... దేశ ప్రజల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే డౌట్ ఉంది. చాలా మంది గ్రామాల్లో వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో... ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది.

    కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముగ్గురు పెద్ద వయసు మహిళలు... అనార్కలి (72), సరోజా (70), సత్యవతి (60) ఉత్తరప్రదేస్... షమ్లీ జిల్లా...కందార పబ్లిక్ హెల్త్ సెంటర్ (PHC)కి వచ్చారు. అప్పటికే బిజీగా ఉన్న ఆరోగ్యకేంద్ర సిబ్బంది... ముగ్గురికీ ఒకేసారి టీకా వేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ వేసేందుకు ఇంజెక్షన్లను వారితో కొనిపించారు. ఆ తర్వాత వ్యాక్సిన్ వేశారు. అరగంటపాటూ ఆస్పత్రిలోనే ఉంచి... ఇంటికి వెళ్లమన్నారు. ఇంటికి వెళ్లిన మహిళలకు రియాక్షన్ వచ్చింది. రకరకాలుగా అవుతుంటే... ఆ మహిళలు చాలా టెన్షన్ పడ్డారు. మళ్లీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి... చీఫ్ డాక్టర్‌ని కలిసి విషయం చెప్పారు.


    చీఫ్ డాక్టర్ పరిశీలించగా... అసలు వాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వలేదనీ... కుక్కలు కరిచినప్పుడు ఇచ్చే రేబిస్ వ్యాధి (rabies vaccine) వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పడంతో... ముగ్గురు మహిళలూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలిసిన మహిళల బంధువులు ఆరోగ్యకేంద్రంపై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా వేరే వ్యాక్సిన్ వేసిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు సరే అన్నారు. ఆ తర్వాత ఆ మహిళలకు స్పెషల్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. రేపటికల్లా ఆ ముగ్గురికీ నయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇది కూడా చదవండి: Business Ideas: రూ.50వేల పెట్టుబడితో కోట్ల సంపాదన... వ్యాపారం పూర్తి వివరాలు

    ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగడం ప్రమాదకరం. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లేవారు ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో చూడాలి. వేసేముందు అదేం వ్యాక్సిన్ అని అడిగి తెలుసుకోవాలి. అది కోవిషీల్డ్ (covishield) లేదా కోవాగ్జిన్  (covaxin) అయితే వేయించుకోవచ్చు. మరేదైనా వేస్తున్నట్లైతే... మీరు ప్రశ్నించడం వల్ల వైద్య సిబ్బంది అప్రమత్తమై... సరైన వ్యాక్సిన్ వేస్తారు.
    Published by:Krishna Kumar N
    First published: