CORONA VACCINE MORE AVAILABLE VACCINES CLEAR THE LINE FOR COVISHIELD AND COVAXIN EVK
Corona Vaccine: మరింత అందుబాటులోకి వాక్సిన్లు.. కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు లైన్ క్లియర్!
ప్రతీకాత్మక చిత్రం
Corona Vaccine | దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సీడీఎస్సీఓ మరో నిర్ణయం తీసుకొంది. అందరికీ వేగంగా వ్యాక్సిన్లు అందిస్తే త్వరగా కరోనా తీవ్రతను తగ్గించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కండిషన్లతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను మార్కెట్ (Market) లోకి అనుమతించేందుకు మార్గం సుగమం అయ్యింది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల (Corona Cases) సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సీడీఎస్సీఓ మరో నిర్ణయం తీసుకొంది. అందరికీ వేగంగా వ్యాక్సిన్లు అందిస్తే త్వరగా కరోనా తీవ్రతను తగ్గించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కండిషన్లతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను మార్కెట్లోకి అనుమతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియం త్రణ సంస్థ (Central Drugs Standard Control Organisation)కు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సిఫార్సు చేసింది. ఇటీవల కోవిషీల్డ్, కోవాగ్జిన్ తయారీ దారులు వారి టీకాను నేరుగా మార్కెట్లో విక్రయించుకొనే సదుపాయం కలిగించాలని కోరాయి. అయితే కేంద్ర దీనిపై స్పందించలేదు. తాజాగా సీడీఎస్సీఓ (CDSCO) ఈ రెండు కంపెనీలు వ్యాక్సిన్‌ను బహిరంగా మార్కెట్లో విక్రయించుకొనేందుకు అభ్యంతరం తెలుపలేదు. దీంతో కేంద్ర ఆమోదంతో త్వరలో వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
దేశంలో కరోనా కేసులు (Corona Cases)భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అయితేఒమిక్రాన్ (Omicron) కేసులతోపాటు మరో మంచి వార్తను అందించనుందా..? త్వరలో కరోనా పూర్తిగా తగ్గిపోతుందా..? ఈ అంశాలపై శాస్త్రవేత్తలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) లో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఎంతో ఆశజనకమైన అంశాన్ని వెల్లడించారు.
ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ డెల్టా వేరియంట్‌కు సంబంధించిన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు. అయితే ఇది అందరిలో జరగడం లేదని అన్నారు. కరోనా రెండు డోసులు తీసుకొన్న వారిలో మాత్రమే ఇటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె అన్నారు. ఈ అంశం పలు అధ్యయనాల్లో వెల్లడైంది అన్నారు. వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో ఒమిక్రాన్ లక్షణాలు కనపడితే వారిలో ఇక డెల్టా వచ్చే అవకాశాలు బాగా తగ్గుతున్నాయని అన్నారు.
కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ (Vaccination) వేగవంతం చేయడమే ముఖ్యంగా కరోనా కట్టడికి అవసరం అనే అధ్యయనంతో అందరికి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం యోచిస్తోంది. ఎంత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తయితే అంత తర్వగా కరోనా తీవ్రతను తగ్గించవచ్చని భావిస్తోంది. ఇటు కర్ణాటక, కేరళలో మాత్రం కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్ణాటక (Karnataka)లో 40,499 కేసులు వెలుగుచూశాయి. నిన్న టితో (41,457) పోలిస్తే కాస్త తక్కు వే అయినప్పటికీ కరోనా కారణంగా మరో 21 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు 18.80 శాతానికి చేరింది. రాజధాని బెం గళూరులోనే 24,135 కేసులు వచ్చాయి. ఐదుగురు మరణించారు. 1,84,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే దేశ రాజధాని దిల్లీ సహా ముంబాయిలోనూ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కేరళలో బుధవారం ఒక్క రోజే 34,199 మందికి కరోనా సోకింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.