E-Parliament : వర్షాకాలంలో వర్చువల్ పార్లమెంట్ సమావేశాలు?... కేంద్రం యోచన...

Corona Lockdown | Corona Update : కరోనా కొత్త ఆలోచనలకు బీజం పోస్తోంది. వైరస్ నుంచి ఎంపీలను కాపాడేందుకు కేంద్రం ఈ-పార్లమెంట్ ఆలోచన చేస్తోంది.

news18-telugu
Updated: June 2, 2020, 10:38 AM IST
E-Parliament : వర్షాకాలంలో వర్చువల్ పార్లమెంట్ సమావేశాలు?... కేంద్రం యోచన...
పార్లమెంట్ (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇంగ్లీష్‌లో ఓ మాట ఉంది. నెసెస్సిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అది వంద శాతం నిజం. కరోనా వచ్చి మీద పడే సరికి మనమంతా... కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాం. క్రియేటివిటీకి పదును పెడుతున్నాం. రొటీన్‌గా జరిగే అంశాలను ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం. మనలాగే కేంద్ర ప్రభుత్వం కూడా... ఈసారి వార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని ఎప్పట్లాగా కాకుండా... ఈ-పార్లమెంట్ తరహాలో చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోంది. ఈ వర్చుపల్ పార్లమెంట్ కాన్సెప్ట్‌కి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు... అనుకూలంగా ఉన్నారు. ఐతే... అది ఇప్పట్లో సాధ్యమవుతుందా అన్న ప్రశ్న వాళ్లు వేశారు.

ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే... సోమవారం... ఈసారి వర్షాకాల సమావేశాల్ని ఎలా నిర్వహించాలి, ఎంపీలు ఎలా సోషల్ డిస్టాన్స్ పాటించాలి అనే చర్చ జరిగినప్పుడు... ఈ-పార్లమెంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. జులై-ఆగస్ట్ మధ్య వర్షాకాల సమావేశాలు జరిగేలా ఉన్నాయి. వెంకయ్యనాయుడు ఇంట్లోనే తాజా మీటింగ్ జరిగింది. ఈసారి లోక్‌సభ సమావేశాలకు సెంట్రల్ హాల్ (అది పెద్దగా ఉంటుంది)ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని చర్చించుకున్నారు. రాజ్యసభను పూర్తిగా వేరే చోటికి షిఫ్ట్ చేస్తే (వాళ్ల సంఖ్య తక్కువ కాబట్టి) అనే అంశమూ చర్చించారు. ఆల్టర్నేట్‌గా సమావేశాలు నిర్వహిస్తే... అంటే... ఓ రోజు లోక్‌సభ, మరోరోజు రాజ్యసభ... ఇలా కూడా ఆలోచించారు.

వర్చువల్ పార్లమెంట్ అంటే ఏం లేదు. ఎవరికి వాళ్లు తమ తమ ఇళ్లు లేదా ఆఫీసుల్లో ఉండి... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటారు.  అప్పుడిక కరోనా సమస్యే ఉండదు. ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించట్లా... అలా.... ఐతే... ఇలాంటి సమావేశాల్లో చర్చలు బాగా సాగుతాయా, బిల్లుల పాస్ ఎలా వంటి చాలా అంశాల్ని పరిశీలించమని పార్లమెంటరీ కమిటీలను కోరారు.

ఒకవేళ వర్చువల్ వైపు నిర్ణయం తీసుకుంటే... అర్జెంటుగా సరికొత్త టెక్నాలజీ, పరికరాలు, కంప్యూటర్లు ఇలా అన్నీ కొనాల్సి వస్తుంది. మొత్తం అప్‌గ్రేడ్ చెయ్యాల్సి ఉంటుంది. మిగిలి ఉన్న టైమ్ నెల మాత్రమే. మార్చి 24న కరోనా వల్లే పార్లమెంట్ సమావేశాల్ని అర్జెంటుగా నిరవధిక వాయిదా వేశారు. మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటన వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో.
Published by: Krishna Kumar N
First published: June 2, 2020, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading