హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రిటైర్ అయిన EPF ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్...

రిటైర్ అయిన EPF ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్...

రిటైర్ అయిన EPF ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్... (File)

రిటైర్ అయిన EPF ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్... (File)

Corona Lockdown | Corona Update : కరోనా కష్టాల సమయంలో.... కమ్యూటేషన్ ఆప్షన్‌తో రిటైర్ అయిన EPF ఉద్యోగులకు వచ్చేనెల నుంచి పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

  Corona Lockdown | Corona Update : మే నెల నుంచి... ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)... 6.3 లక్షల మంది ఉద్యోగులకు పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వబోతోంది. వారంతా... రిటైర్మెంట్ సమయంలో కమ్యూటేషన్‌ ఆప్షన్‌కి ఒప్పుకున్నవారే. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో చేపట్టింది. కమ్యూటేషన్ అనేది పెన్షనర్లకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఆప్షన్. దీన్ని ఎంచుకున్నవారికి నెలవారీ వచ్చే పెన్షన్‌లో కొంత మొత్తం పక్కన పెట్టి... రిటైర్మెంట్ సమయంలో... ఒకేసారి పెద్ద మొత్తం ఇస్తారు. EPS ప్రకారం... 2008 సెప్టెంబర్ 26కి ముందు రిటైర్ అయిన EPFO మెంబర్... ఒకేసారి మూడింట ఒక వంతు డబ్బును పెన్షన్ అమౌంట్‌గా పొందగలరు. మిగతా రెండొంతుల మనీని... జీవితకాలం పాటూ... నెలవారీ పెన్షన్‌గా పొందగలరు.

  ఐతే... EPFOకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్... గతేడాది ఆగస్టు 21న సమావేశమై ఓ ప్రతిపాదనను ఆమోదించారు. దాని ప్రకారం... 2008 సెప్టెంబర్ 26కి ముందు రిటైరైన వారికి కోతలు లేకుండా పూర్తిస్థాయి నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఐతే... ఇలా పొందాలనుకునేవారు... పెన్షన్ కమ్యూటేషన్ ఆప్షన్‌కి ఒప్పుకోవాల్సి ఉంటుంది.

  తాజా నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ.1500 కోట్ల భారం పడుతుంది. ఆల్రెడీ కరోనా వైరస్ కారణంగా... కేంద్రానికి వచ్చే ఆదాయం తగ్గిపోయిన సమయంలో... ఇది కేంద్రానికి మరో భారంగా మారుతోంది. పెన్షన్ మనీని వీలైనంత త్వరగా ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిసింది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: EPFO

  ఉత్తమ కథలు