CORONA TREATMENT THE TREATMENT SHOULD BE CHANGED DOCTORS SAYS THERE IS POSSIBILITY OF BLACK FUNGUS EVK
Corona Treatment: చికిత్స విధానం మార్చాలి.. బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం: వైద్యులు
(ప్రతీకాత్మక చిత్రం)
Unwarranted Medications |దేశంలో మళ్లీ మూడో వేవ్ (Third Wave) ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనుసరిస్తున్న చికిత్స విధానం.. గతేడాదిలానే లోపభూయిష్టంగా ఉందని.. దీన్ని మార్చాలని సూచించారు. లేకుంటే బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దేశంలో మళ్లీ మూడో వేవ్ (Third Wave) ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముం బయిలోని జస్లోక్ ఆస్ప త్రి వైద్యు డు డాక్టర్ సంజయ్ నాగ్రాల్, కేరళలోని రాజ్గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిరియక్ ఫిలిప్, బెంగళూరుకి చెందిన డాక్టర్ రాజనీ భట్, యూఎస్, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా విషయంలో సెకండ్ వేవ్ (Second Wave) సమయంలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని వైద్యులు (Doctors) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికిత్స విధానంలో మార్పులు అవసరం అని వారు అభిప్రాయ పడ్డారు.
అతి మోతాదులో మందులు..
ప్రస్తుతం కొవిడ్19 (Covid 19) బాధితుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించట్లేదు. మరికొందరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అలాంటి వారికి పెద్దగా వైద్య చికిత్స అవసరం ఉండదు. కానీ, అనవసరంగా ఔషధాలు ఇస్తూ వారిని మరింత అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నారు. కొవిడ్ చికిత్సకు ప్రస్తుతం ఇస్తున్న ఔషధాలు అతి మోతాదులో ఇస్తున్నారు. దీని వల్ల రోగులకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకేప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి అనవసరమైన మందుల వినియోగమే కారణం అని వైద్యులు పేర్కొన్నారు.
అవసరం లేకున్నా పరీక్షలు..
కొందరు వైద్యులు అవసరం లేకపోయినా సీటీ స్కాన్ (CT Scan), డీ-డైమర్ వంటి పరీక్షలు చేయించుకోవాలని బాధితులకు సూచిస్తున్నారు. ఇది బాధిత కుటుం బాలకు అదనపు ఆర్థిక భారంగా మారుతాయి. కొన్ని ఆస్ప త్రులు కొవిడ్ బాధితుల్ని భయపెట్టి ఆస్పత్రిలో చేరేలా చేస్తున్నాయి. దీంతో కరోనా (Corona) తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆస్పత్రిలో పడకలు అందుబాటులో లేకుండాపోతున్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలని సూచించారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.