CORONA THIRD WAVE IIT MADRAS SURVEY ON THE THIRD WAVE IN THE COUNTRY CASES WILL REACH ITS PEAK IN FEBRUARY EVK
Corona Third Wave: దేశంలో మూడో వేవ్‌పై ఐఐటీ మద్రాస్ సర్వే.. గరిష్టస్థాయికి వెళ్లేది అప్పుడే..!
ప్రతీకాత్మక చిత్రం
Corona Third Wave | దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపుగా మూడో వేవ్ వచ్చినట్టే అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ తాజాగా సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మూడో వేవ్ గరిష్టస్థాయికి ఎప్పుడు చేరుతుందో ప్రాథమిక విశ్లేషణ వేసింది.
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్నాయి. దాదాపుగా మూడో వేవ్ వచ్చినట్టే అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ తాజాగా సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మూడో వేవ్ గరిష్టస్థాయికి ఎప్పుడు చేరుతుందో ప్రాథమిక విశ్లేషణ వేసింది. శాస్త్రీయ పద్దతిలో కంప్యూటేషనల్ మోడలింగ్ విధానంలో Basic reproduction number అంటే ఆర్ నాట్ (R-naught) వ్యాల్యుని అంచనా వేసింది. డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 31 వరకు దేశంలో ఆర్ నాట్ విలువ జాతీయ స్థాయిలో 2.9కి దగ్గరగా ఉంది. జనవరి 1-6, 2022 వద్ద ఈ సంఖ్య 4కి చేరుకుంది. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ (IIT Madras) గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా వివరించారు. R0 అనేది ట్రాన్స్మిసిబిలిటీ ప్రాబబిలిటీ, కాంటాక్ట్ రేట్, ఇన్ఫెక్షన్ సంభవించే అంచనా, సమయ వ్యవధి, అనే మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
గరిష్ట కేసులు ఎప్పుడంటే..
ప్రస్తుతం దేశంలో కరోనా పెరుగుదల రేటు ఆధారంగా పలు విశ్లేషణలు చేసిన ఐఐటీ మద్రాస్.. ఫిబ్రవరి 1-15 మధ్య మూడవ వేవ్ యొక్క గరిష్ట స్థాయిని తాకుతుందని తెలిపింది. ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంటుందని సర్వేలో వివరించారు. అయితే వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు ఈ రేటును ప్రభావితం చేయగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
WHO: ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదు అనేది అవాస్తవం.. జాగ్రత్త తప్పని సరి: డబ్ల్యూహెచ్ఓ
IIT మద్రాస్ గణిత విభాగం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ సంయుక్తంగా ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయే, ప్రొఫెసర్ ఎస్ సుందర్ నేతృత్వంలో ప్రాథమిక విశ్లేషణ నిర్వహించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒమిక్రాన్ (Omicron) కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆర్-నాట్ విలువ 1.69 ఉందని తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ఒకే రోజు 1,41,986 కొత్త కరోనావైరస్ (Corona Virus) కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 3,53,68,372కి చేరుకుంది. ఇందులో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు నమోదైన 3,071 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.