హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Corona Lockdown: రాష్ట్రాల్లో లాక్‌డౌన్ టెన్షన్లు... మళ్లీ అమలు దిశగా ప్రభుత్వాలు

Corona Lockdown: రాష్ట్రాల్లో లాక్‌డౌన్ టెన్షన్లు... మళ్లీ అమలు దిశగా ప్రభుత్వాలు

Centre New Guidelines: కరోనా కట్టడి.. రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే..

Centre New Guidelines: కరోనా కట్టడి.. రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే..

Corona Lockdown: మహారాష్ట్ర, ఢిల్లీని చూసి మిగతా రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఏయే రాష్ట్రాలు ఏ ప్రయత్నాలు చేస్తున్నాయో తెలుసుకుందాం.

  Corona Lockdown: దేశంలో మరోసారి లాక్‌డౌన్ ఉండదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ... కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాల ప్రభుత్వాలు... లాక్‌డౌన్ వల్లే కంట్రోల్ అవుతుందని భావిస్తున్నాయి. అందువల్ల లాక్‌డౌన్ అనే పేరు వాడకుండా... కర్ఫ్యూ పేరుతో దాదాపు లాక్‌డౌన్ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా రోజూ 65వేల కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో వీకెండ్ లాక్‌డౌన్ ఉంది. ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సాయంత్రం నుంచి వారంపాటూ లాక్‌డౌన్ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌పై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని 5 నగరాల్లో ఏప్రిల్‌ 26 వరకు లాక్‌డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు కూడా వీకెండ్ లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో పంజాబ్‌, రాజస్థాన్‌, కేరళ, మేఘాలయ, మణిపూర్‌ వంటి రాష్ర్టాలు కఠిన ఆంక్షలు ప్రకటించాయి.

  ఢిల్లీలో లాక్‌డౌన్‌:

  ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించాక, రూల్స్ రిలీజ్ చేశారు. వాటి ప్రకారం అత్యవసర సేవలకు ఆటంకం ఉండదు. ప్రైవేటు ఆఫీసులు, షాపులు, మాల్స్‌, వీకెండ్ మార్కెట్లు, తయారీ సంస్థలు, విద్య, శిక్షణ కేంద్రాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఆడిటోరియంలు, బార్లు, ప్రభుత్వ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, జిమ్‌లు, స్పా సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లను మూసేశారు. 50 శాతం సామర్థ్యంతో ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చారు. ట్యాక్సీల్లో డ్రైవర్‌తోపాటూ... ఇద్దరికంటే ఎక్కువ మంది ఉండకూడదని చెప్పారు. పెళ్లికి 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదని ఆర్డర్ వేశారు.

  ఉత్తరప్రదేశ్‌లో:

  ఉత్తరప్రదేశ్‌లో రోజూ 30 వేల దాకా కరోనా కేసులు వస్తున్నాయి. అందువల్ల అక్కడి లక్నో, ప్రయాగరాజ్‌, వారణాసి, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌లో ఏప్రిల్‌ 26 వరకు లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ ఆగాలంటే... ప్రజల మధ్య లింక్ పోవాలని హైకోర్టు తెలిపింది.

  రాష్ట్రాల్లో ఆంక్షలు:

  పంజాబ్ సీఎం తమ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. రాత్రి కర్ఫ్యూని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పెంచారు. బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌, స్పా సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లను ఏప్రిల్‌ 30 వరకు మూసేయాలని ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయ.. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే పర్యాటకులకు అనుమత రద్దు చేసింది. మే 4 వరకు స్కూళ్లను మూసివేసింది. తమ రాష్ట్రంలోని ఆఫీసులు, మార్కెట్లను మూసివేస్తున్నట్టు రాజస్థాన్‌ ప్రభుత్వం తెలిపింది. ఇక కేరళ, మణిపూర్‌లో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలవుతుంది.

  ఇది కూడా చదవండి:Telangana Teachers: తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు నేడు డబ్బు పంపిణీ... ఇలా పొందండి

  ఇలా చాలా రాష్ట్రాలు కరోనాను కట్టడి చేసేందుకు ఆంక్షలు, కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ఈ వారంలో కరోనా ఇంకా పెరిగితే... మరికొన్ని రాష్ట్రాలు ఢిల్లీ బాటలో పయనించే అవకాశం ఉంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Coronavirus, Covid-19, Lockdown

  ఉత్తమ కథలు